Begin typing your search above and press return to search.

నటి మీరా మిథున్ కు అరెస్ట్ వారెంట్

By:  Tupaki Desk   |   24 March 2022 10:30 AM GMT
నటి మీరా మిథున్ కు అరెస్ట్ వారెంట్
X
వివాదాస్పద నటి మీరా మిథున్ కు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షెడ్యూల్ తెగలను కించపరచడం.. అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి వచ్చే 4వ తేదీ కోర్టులో హాజరుపరుచాల్సిందిగా సెంట్రోల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులను ఆదేశించింది. దీంతో ఆమె మరోమారు వార్తలకెక్కింది.

కేరళకు చెందిన మీరా మిథున్ తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. అయితే ఆ తరువాత తనకు అవకాశాలు ఇవ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అంతేకాకుండా ఓ వర్గంపై ప్రత్యేకంగా దూషణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళ సినీ ఇండస్ట్రీలో దళితులను తరిమేయాలని వ్యాఖ్యలు చేసింది. ఓ డైరెక్టర్ తన ఫొటోను దొంగిలించి ఫస్ట్ లుక్ కోసం వాడుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని షెడ్యూల్డ్ కూలాలందరిని తప్పనిసరిగా తప్పించాలని ఆమె వివాదాస్పదంగా మాట్లాడింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియో వైరల్ కావడంతో దళిత సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు మీరా మిథున్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్ 153, 153 ఎ(1), 505 (1) (బి), 505(2) మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అనేక కేసులు నమోదు చేశారు. దీంతో అమెను అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ పోస్టులపై మీరా మిథున్ స్పందించారు. తనను అరెస్టు చేయడం సాధ్యం కాదని అన్నారు. వాళ్లకు సాధ్యమైతే నన్ను అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరింది. తనను అరెస్టు చేయడం కలలోనే జరుగుదుందని చెప్పింది.

అయితే 14న మీరా మిథున్ ను పోలీసులు కేరళలో కనుగొన్నారు. అయితే ఆమెను అరెస్టు చేయడానికి ముందు మీరా మిథున్ ఆందోళన చేశారు. అమెను అరెస్టు చేయడానికి ముందుకు పోలీసులు ఆమెను ఫోన్ ఇవ్వాలని అడుగుతున్న వీడియో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే తనపై చెయ్యేస్తే చనిపోతానని ప్రధానమంత్రి మోడికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆమె పోస్టు చేశారు. కాగా తన ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి నిరాకరించింది. తనను అరెస్టు చేసే హక్కు లేదని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి వచ్చే 4వ తేదీ కోర్టులో హాజరుపరుచాల్సిందిగా సెంట్రోల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులను ఆదేశించింది