Begin typing your search above and press return to search.
ఒక్క ఫ్లాప్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చురగిల్చింది
By: Tupaki Desk | 23 March 2022 9:38 AM GMTఏ సినిమా ఏ స్టార్ ని ఎలా వెనక్కి నెట్టేస్తుందో .. ఏ మూవీ పాతాక స్థాయిలో నిలబెట్టి జయ జయ ధ్వానాలు పలికిస్తుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రతీ ఫ్రైడే జాతకాలు మారుతుంటాయి కాబట్టి. అలాంటి శుక్రవారం ఇప్పుడు ముగ్గురు హీరోల మధ్య చిచ్చుని రగిల్చింది. ఏ కంగా ఫ్యాన్స్ మధ్య వార్ ని డిక్లేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. `బాహుబలి`తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ దాదాపు మూడేళ్ల తరువాత `రాధేశ్యామ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్చి 11న ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది.
ఈ మూవీ రిలీజ్ కు ముందు భారీ హంగామా జరిగింది. భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ స్థాయిలో సినిమా లేదని, ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు మిక్స్డ్ టాక్ వినిపించారు. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెలవమైన ప్రదర్శనని చూపించింది. పది రోజుల్లో ఈ మూవీ 200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. డివైడ్ టాక్ రావడం వల్లే ఈ మూవీ భారీ స్థాయిలో అంచనాలకు అనుగుణంగా వసూళ్లని రాబట్టలేకపోయింది.
ప్రీ రిలీజ్ పరంగా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన ఈ మూవీ వసూళ్ల పరంగా మాత్రం భారీ స్థాయిలో నష్టాలని అందించబోతోందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. దాదాపుగా 60 కోట్ల మేర ఈ మూవీకి నష్టాలు వాటిల్లడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఈ వార్త ఇప్పడు ముగ్గురు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చుకు ప్రధాన కారణంగా మారింది. ప్రభాస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక భారీ నష్టాలని ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అబిమానుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.
ఆ ద్వేషాన్ని ఇద్దరు హీరోల అభిమానులపై చూపించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులపై విరుచుకుపడుతున్నారు. తీవ్రంగా కామెంట్ లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం `రాధేశ్యామ్` రిలీజ్ సమయంలో పవర్ స్టార్ `భీమ్లానాయక్` థియేటర్లలో వుంది. ఈ చిత్రాన్ని పుష్ చేయడం కోసం `రాధేశ్యామ్`పై అసత్య ప్రచారం చేశారని, కావాలనే మా హీరో సినిమాకి దెబ్బేశారని ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారట.
ఈ మూవీకి థియేటర్లు తగ్గడం వెనక పెద్ద కుట్రే జరిగిందని, అంతే కాకుండా సినిమాపై నెగెటివ్ టాక్ ని స్పెడ్ చేయడంలోనూ పవన్ ఫ్యాన్స్ ప్రముఖ పాత్ర పోషించారని, తద్వారా `భీమ్లానయక్`కు ప్లస్ అయ్యేలా వ్యవహరించారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారట. ఇక `రాధేశ్యామ్`పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడానికి బన్నీ ఫ్యాన్స్ కూడా ఓ కారణం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ కొంత డ్యామేజీకి కారణంగా నిలిచిందిని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.
అయితే ఎంటైర్ ఎపిసోడ్ ని గమనించిన వారంతా మాత్రం `రాధేశ్యామ్`లో కంటెంట్ లోపించడం వల్లే ఫలితం ఇలా వుందని, ఇది ఫ్యాన్స్ తో పాటు ప్రతీ ఒక్కరూ అంగీకరించాల్సిన విషయమని, దీన్ని గమనించి అనవసర రాద్ధాంతాలకు వెళ్లకపోవడం మంచిదని కొంత మంది ఫ్యాన్స్ కి సూచిస్తున్నారట. మరి ఈ మాటలని ఫ్యాన్స్ వింటారా? లేక `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వరకు ఇదే తరహాలో కంటిన్యూ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.