Begin typing your search above and press return to search.
RRR లో ఆ ఫైట్ వెనక ఇంత స్టోరీ వుందా?
By: Tupaki Desk | 22 March 2022 5:40 AM GMTదేశ వ్యాప్తంగా ఇప్పడు ఏ సినీ లవర్ నోట విన్నా ఒక్కటే మాట ట్రిపుల్ ఆర్. మరో మూడు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ చిత్రం కోసం దాదాపు మూడున్నరేళ్లుగా దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీని మార్చి 25న మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకులు ఊహించని ఫార్మాట్ లలో ఒకే సారి అందించి అబ్బురపరచబోతున్నారు. ఈ మూవీని 2డీ వెర్షన్ తో పాటు మేకర్స్ 3డీ ఫార్మాట్ లోనూ, ఐమాక్స్ ఫార్మాట్ లోనూ అందిస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 14 నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చేసి ప్రచారం పరంగానూ షాకిస్తున్న జక్కన్న `బాహుబలి`ని మించి ఈ మూవీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు. దేశ వ్యాప్తంగా టీమ్ తో తిరుగుతూ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ మంగళవారం చిత్ర బృందం కోల్‌కతా, వారణాసిలలో ఈ మూవీ ప్రమోషన్స్ ని నిర్వహించబోతోంది. కోల్ కతాలో ప్రత్యేకంగా మీడియాతో సమావేశం అవుతున్నటీమ్ ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు వారణాసిలో ప్రత్యేక గంగా హారతికి హాజరు కాబోతోంది.
ఇక ఈ నెల 23న భారీ స్థాయిలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పాల్గొనే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి రికార్డెడ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించి సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా యాంకర్ సుమ చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియోలో ఈ చిత్రంలోని ప్రధాన హైలైట్ లలో ఒకటిగా నిలిచే బుల్లెట్ ఫైట్ కి సంబంధించిన ఆసక్తికరమైన ఓ విషయాన్ని బయటపెట్టారు. ముందుగా ఈ ఫైట్ ని ముంబైలో షూట్ చేశారట. అయితే రషెస్ చూసుకున్న తరువాత అనుకున్న ఫీల్ కనిపించకపోవడం, అందులో లైటింగ్, ఫైర్ వర్క్ సరిగా కనిపించకపోవడంతో మళ్లీ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్ వేసి మరీ రీ షూట్ చేశారట.
కేవలం ఈ ఫైట్ కోసమే ముంబైలో వాడిన గుర్రాన్ని, బుల్లెట్ ని మళ్లీ హైదరాబాద్ తెప్పించారట. కార్తికేయ కారణంగానే ఈ ఫైట్ ని జక్కన్న మళ్లీ రీషూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫైట్ పై అభిప్రాయం అడిగితే బాగా రాలేదని, మళ్లీ చేయాల్సిందేనని చెప్పాడట. దాంతో ఉలిక్కిపడ్డ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ ఫైట్ కోసం జక్కన్న టార్చర్ పెట్టాడు. మళ్లీ చేయాలా? అని ఫీలయ్యాడట. అయినా నో కాంప్రమైజ్ అన్న రాజమౌళి బుల్లెట్ ఫైట్ ని హైదరాబాద్ లో రీ షూట్ చేశారట.