Begin typing your search above and press return to search.
30 వేల పాటలు పాడిన ఏకైక గాన కోకిల
By: Tupaki Desk | 6 Feb 2022 2:38 PM GMTగాన కోకిల లతా మంగేష్కర్ నోటి నుంచి జాలు వారిన ప్రతీ పాటా మధురాతిమధురమైన ఓ సంతకం. అందుకే భారతదేశ కోకిలగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. దశాబ్ధాల పాటు తన గానామృతంతో శ్రోతల్ని మంత్రముగ్దుల్ని చేసారు. భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసారు. అంతటి లెజెండరీ గాయని గురించి కొన్ని ఆసక్తికర సంగతులు..
లతా మంగేష్కర్ 1929 లో సెప్టెంబర్ 29న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్-శుద్దమతిలకు మొదటి సంతానం లతాజీ. చిన్నతనంలోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు అమన్ అలీఖాన్..అమాన్ అలీఖాన్ ల వద్ద శిష్యరికం చేసారు. అటుపై 13 ఏళ్ల వయసులోనే కుటుంబ భారమంతా నెత్తిన వేసుకున్నారు. లతాజీ తొలిసారి 1942 లో `పహ్లా మంగళ్ గౌర్` అనే చిత్రంలో నటించి..పాటలు కూడా పాడారు. గాయని గుర్తించే సమయంలో లతాజీ ఎన్నో విమర్శలు ఎదుర్కున్నారు. ఆ విమర్శల్నే విజయాలకు సోపానాలుగా మార్చుకుని ముందుకు సాగారు.
గాయనిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. `మహాల్` సినిమాతో మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు. అందులో `అయేగా అయేగా` పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అక్కడ నుంచి లతాజీ వెనక్కి తిరిగి చూడలేదు. `అందాజ్`..`బడీ బహాన్`..`బర్సాత్` ..`ఆవారా`..`దులారీ` చిత్రాలతో స్టార్ సింగర్ గా ఎదిగారు. ఓ వైపు పాటలు పాడుతూనే మరోవైపు సంగీత కచేరీలు నిర్వహించేవారు. 1974 లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ కచేరీ చేసారు.
అలా 1948 నుంచి 1978 వరకూ 30000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. ఎన్నో జాతీయ..అంతర్జాతీయ అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఆమె సేవలకు గాను భారతరత్న..పద్మవిభూషణ్..పద్మభూషణ్ వంటి అవార్డులు దక్కాయి. ఔత్సాహికుల్ని ప్రోత్సహిచడంలోనూ లతాజీ ఎంతో చొరవ తీసుకునేవారు. 1948 లో లతా మంగేష్కర్ కి గులా హైదర్ మార్గదర్శకం చూపించారు. 1950 తర్వాత నుంచి బాలీవుడ్ లో బిజీ అయిన లతాజీ ఐదేళ్లకే మ్యూజిక్ డైరెక్టర్ గా మొదలయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మహరాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు. నిర్మాతగా మారి నాలుగు సినిమాల్ని నిర్మించారు. నేపథ్య గాయనిగా నైటింగేల్ ఖాతాలో మూడు జాతీయ అవార్డులున్నాయి.