Begin typing your search above and press return to search.

ఈషా అంబానీ పెళ్లికి భారతరత్న గిఫ్ట్‌..!

By:  Tupaki Desk   |   18 Dec 2018 8:49 AM GMT
ఈషా అంబానీ పెళ్లికి భారతరత్న గిఫ్ట్‌..!
X
ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ తన కూతురు ఈషా అంబానీ వివాహాన్ని ఇటీవలే చేసిన విషయం తెల్సిందే. ఈషా అంబానీ, ఆనంద్‌ పిరమిల్‌ ల వివాహం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ పెళ్లికి కానంత అత్యంత ఖర్చు ఈ పెళ్లికి అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. దేశ విదేశాల నుండి అతిరథ మహారథులు హారు అయ్యారు. ఈ పెళ్లి గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అంతటి ప్రాచుర్యంను దక్కించుకున్న ఈ పెళ్లికి సంబంధించిన ఒక చిన్న వీడియోను అంబానీ ఫ్యామిలీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఈ వీడియోలో అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన పెళ్లి తంతుకు సంబంధించిన కొన్ని షాట్స్‌ ఉన్నాయి. వచ్చిన గెస్ట్‌ లను చూపుతూ ఆ వీడియో సాగింది. ఆ వీడియో బ్యాక్‌ గ్రౌండ్‌ లో భారతరత్న లత మంగేష్కర్‌ వాయిస్‌ వచ్చింది. గాయత్రి మంత్రం చదవడంతో పాటు నూతన వధువరులకు ఆమె తన అమృతమైన గొంతుతో శుభాకాంక్షలు తెలియజేశారు. అంబానీ కుటుంబానికి లత మంగేష్కర్‌ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అనారోగ్య కారణం వల్ల ఈషా పెళ్లికి ఆమె రాలేక పోయింది. కాని ఆమె ఆశీర్వాదంను, ఆమె బహుమానంను ఇలా వాయిస్‌ రూపంలో ఇచ్చారు. ఈషా పెళ్లికి నిజంగా ఇది గొప్ప గిఫ్ట్‌గా చెప్పుకోవచ్చు. భారతరత్న గాయని గొంతు ద్వారా పెళ్లి కోసం గాయత్రి మంత్రం మరియు ఆ గొంతుతో పెళ్లి శుభాకాంక్షలు దక్కడం నిజంగా ఈషా మరియు ఆనంద్‌ ల అదృష్టంగా చెప్పుకోవచ్చు.