Begin typing your search above and press return to search.
'లవకుశ' లవుడు మృతి
By: Tupaki Desk | 7 Sept 2020 6:20 PM ISTనందమూరి తారక రామారావు, అంజలిదేవి రాముడు సీతగా నటించిన చిత్రం 'లవకుశ'. సి పుల్లయ్య మరియు సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతారాముల పిల్లలు అయిన లవకుశ పాత్రలను పోషించిన అప్పటి బాల నటులు ఎంతో ఫేమస్ అయ్యారు. సినిమా అంతటి విజయాన్ని సాధించడంకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని కారణాలను చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా లవకుశల నటన అంటూ చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నారు. చిన్న వారు అయినా చాలా బాగా నటించారంటూ ఎప్పుడు కూడా వారిపై ప్రముఖులు ప్రశంసలు కురిపించేవారు.
సినిమాలో లవుడి పాత్ర పోషించిన నాగరాజు నేడు ఉదయం హైదరాబాద్ గాంధీనగర్ లోని తన నివాసంలో కన్నమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. నాగరాజు గారు లవకుశ సినిమా తర్వాత ఎక్కువగా సినిమాల్లో చేయలేదు. అందుకు కారణాలు ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఆయన ఎప్పటికి గుర్తు ఉండేలా నిలిచాడు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు మరియు లవకుశ సినిమా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.