Begin typing your search above and press return to search.

గ‌న్ లేనోళ్లకు నో-ఎంట్రీ అంటున్న లావ‌ణ్యం

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:04 AM IST
గ‌న్ లేనోళ్లకు నో-ఎంట్రీ అంటున్న లావ‌ణ్యం
X
లోడ్ చేసిన మెషీన్ గ‌న్ ధ‌నాధ‌న్ మంటూ పొగ‌లు క‌క్కుతూ బుల్లెట్ల వ‌ర్షం కురుస్తుంటే.. ఆ ఫోర్స్ కి కొన్ని బుల్లెట్లు జారి కింద ప‌డుతుంటే.. ఇలాంటి ఎపిసోడ్ లో ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ నో ఊహించుకోగ‌లం కానీ లావ‌ణ్య త్రిపాఠిని ఊహించుకోగ‌ల‌మా? కానీ ఊహ‌కంద‌నిది చేసి చూపించ‌డ‌మే డెహ్రాడూన్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌త్యేక‌త‌.

చూస్తుంటే అందాల రాక్ష‌సి ఏదో ప్ర‌యోగం చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇది ఫ‌న్ రైడ్ తో కూడుకున్న థ్రిల్లింగ్ మూవీ అని హింట్ ఇచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన బ‌ర్త్ డే విషెస్ పోస్ట‌ర్ లో లావ‌ణ్య త్రిపాఠి కొత్త లుక్ తో హీటెక్కించింది. అలా భారీ మెషీన్ గ‌న్ ని చేత‌ప‌ట్టి ధ‌డ‌ధ‌డ‌లాడిస్తోంది. పొగ‌లు కక్కుతున్న గ‌న్ నుంచి బుల్లెట్ల వ‌ర్షం కురుస్తోంది. లావ‌ణ్య తీక్ష‌ణ‌మైన ఎక్స్ ప్రెష‌న్ తో గుండెల్ని చిద్రం చేస్తోంది. మెరుపులు మిరుమిట్ల డ్రెస్ లో ఇంత హాట్ గా లావ‌ణ్య‌ను ప్రెజెంట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.

తాజా ప్ర‌క‌ట‌న‌లో లావ‌ణ్య ఏం చెప్పిందంటే....``నా తదుపరిది .. నేను దాని వెరైటీ గురించి చెప్పినప్పుడు నన్ను నమ్మండి! నేను మత్తు వదలారా చూసినప్పుడు @రితేష్ రానా. జి ట్విస్టెడ్ హాస్యం తెలివైన రచన నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి. ఈ యువ బృందం మీ కోసం ఏమి అందిస్తుందో తెలియాలంటే కాస్త ఆగాలి. తెర‌పై చూడటానికి నేను వేచి ఉండలేను!`` అంటూ వెల్ల‌డించింది. మైత్రి మూవీ మేక‌ర్స్ - క్లాప్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. వెన్నెల కిషోర్ -సత్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. #nogunsnoentry హ్యాష్ ట్యాగ్ తో లావ‌ణ్య త్రిపాఠి ఫోటోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. రితేష్ రానా పార్టీ - నో గ‌న్ నో ఎంట్రీ పేరుతో ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది. చెర్రీ -హేమ‌ల‌త ఈ చిత్రానికి నిర్మాత‌లు. కీర‌వాణి వార‌సుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు.