Begin typing your search above and press return to search.

లావణ్య గ్లామర్ వర్కవుట్ కాలేదే

By:  Tupaki Desk   |   15 May 2017 10:21 AM IST
లావణ్య గ్లామర్ వర్కవుట్ కాలేదే
X
ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చి హైద్రాబాద్ లో సెటిల్ అయిపోయిన లావణ్య త్రిపాఠికి మొదటి నుంచి పక్కింటి అమ్మాయి పాత్రలే వస్తున్నాయి. యాక్టింగ్ లో సూపర్బ్ ట్యాలెంట్ చూపించడం.. మొదటి నుంచి అదే టైపు కేరక్టర్లు రావడంతో.. తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటపెట్టాలని ఫిక్స్ అయిపోయింది లావణ్య.

ఈ విషయాన్ని తనే చెప్పడమే కాదు.. రీసెంట్ గా రిలీజ్ అయిన రాధ మూవీలో లావణ్య త్రిపాఠి గ్లామర్ షో కూడా చేసింది. అయితే.. అమ్మడికి తన పర్సనాలిటీపై బాగా అవగాహన ఉండడంతో.. ముందుగా బాగా వర్కవుట్స్ చేసి.. స్లిమ్ అయిపోయి మరీ అందాల ప్రదర్శనకు ప్రయత్నించింది. పాటల్లో కాస్త శృతి మించింది కూడా. అయితే.. ఈ గ్లామర్ షో అంతగా వర్కవుట్ కాలేదు. మరీ బక్క చిక్కిపోయినట్లుగా ఉన్న లావణ్య అందాలు ఆడియన్స్ కంటికి అంతగా ఆనలేదు. గ్లామర్ విషయంలో మరీ నాజూకు అందాలు దక్షిణాదిలో అంతగా వర్కవుట్ కావు. నార్త్ లో జీరో సైజులకు తెగ డిమాండ్ ఉంటుంది కానీ.. ఇక్కడి జనాలకు మాత్రం నిండైన అందాలు కావాల్సిందే.

అందుకే మరీ సన్నగా మారిపోయి చూపించిన లావణ్య అందాలు.. రాధ మూవీలో అంతగా టాపిక్ అవలేదు. ఇక కేరక్టర్ కూడా తక్కువగా ఉండడం.. సినిమాకి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా శర్వానంద్ పాత్రే నిలవడం.. కామెడీ కూడా శర్వా చుట్టూనే నడవడంతో లావణ్య అందాలు దాదాపుగా వృథా అయిపోయినట్లే.