Begin typing your search above and press return to search.

అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు: లావణ్య‌ త్రిపాఠి

By:  Tupaki Desk   |   20 Aug 2022 7:00 AM GMT
అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు: లావణ్య‌ త్రిపాఠి
X
మూడు పదుల వయసొచ్చినా ఇంకా పెళ్లి పీట‌లెక్క‌ని హీరోయిన్ల జాబితాలో లావ‌ణ్య త్రిపాఠి ఒక‌రు. 'అందాల రాక్షసి'తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన లావ‌ణ్య త్రిపాఠి.. తొలి చిత్రంతోనే సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా అనంత‌రం లావ‌ణ్య త్రిపాఠి వ‌రుస పెట్టి చిత్రాలు చేసింది. కానీ, వాటిలో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, అర్జున్ సురవరం మిన‌హా.. మిగిలిన సినిమాలేవి మంచి విజ‌యం సాధించ‌లేదు.

గ‌త కొంత కాలం నుంచి ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న లావ‌ణ్య త్రిపాఠి రీసెంట్ గా 'హ్యాపీ బర్త్‌డే' మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నరేష్ ఆగస్త్య, వెన్నెల కిశోర్, సత్య కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే జూలై 15న విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఓటీటీలోనూ ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక‌పోతే మ‌రోవైపు లావ‌ణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్రేమ‌లో ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసుకుంటార‌ని ఎప్ప‌టి నుంచో జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ వార్త‌ల‌పై లావ‌ణ్య ప‌రోక్షంగా ఇప్ప‌టికే ఖండించింది. అయినా స‌రే ఈ వార్త‌ల‌కు పులి స్టాప్ ప‌డ‌టం లేదు. అయితే తాజాగా లావ‌ణ్య త్రిపాఠి ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చ‌టించింది.

ఈ సంద‌ర్భంగా ఆమె ప్రేమ, పెళ్లి వంటి విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. చాలా మంది తొలి చూపులోనే ఎదుటి వ్యక్తితో ప్రేమలో పడినట్లు చెబుతుంటారు. కానీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ను తాను ఎప్ప‌టికీ నమ్మనని లావణ్య‌ త్రిపాఠి చెప్పుకొచ్చింది. అలాగే తనకు పెళ్లి మీద ఎంతో నమ్మకం ఉందని, అయితే ప్రస్తుతం తాను మాత్రం సింగిల్ గానే ఉన్నాన‌ని ఆమె స్ప‌ష్టం చేసింది.

సరైన జీవిత భాగస్వామి దొర‌క్క‌పోవ‌డం వ‌ల్లే ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని లావణ్య త్రిపాఠి తెలిపింది. ఈ క్ర‌మంలోనే వరుణ్ తేజ్ తో ప్రేమ‌, పెళ్లి వార్త‌ల‌పై కూడా ఆమె స్పందించింది. వ‌రుణ్ తేజ్ తో క‌లిసి రెండు సినిమాలు చేయ‌డం వ‌ల్లే.. అలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయ‌ని లావ‌ణ్య త్రిపాఠి పేర్కొంది. ఇక సినీ ఇండ‌స్ట్రీలో నిహారిక, రీతూ వర్మ, సందీప్ కిషన్, అల్లు శిరీష్ లు త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి లావ‌ణ్య మాట‌ల‌తో.. ఆమె వ‌రుణ్ తో ప్రేమ‌లో లేద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.