Begin typing your search above and press return to search.

​100% మళ్ళీ రాక్షసే చేస్తోందట

By:  Tupaki Desk   |   29 Jun 2017 7:23 AM GMT
​100% మళ్ళీ రాక్షసే చేస్తోందట
X
కొన్నేళ్ళ కిందట సుకుమార్ డైరక్షన్లో వచ్చిన యంగ్ రొమాంటిక్ లవ్ స్టోరీ 100% లవ్ సినిమా గుర్తుందా? అది ఇప్పుడు తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో మిల్కీ బ్యూటి తమన్నా చక్కగా ఇమిడిపోయింది. దానికి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా అప్పటిలో ఒక మ్యూజికల్ హిట్. పాటలు - కథ - హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అన్నీ ఈ సినిమాలో చక్కగా కుదిరి నాగ చైతన్య కెరియర్ లో మంచి హిట్ గా మిగిలిపోయింది.

ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో తీస్తున్నారు మరి దానిలో హీరోయిన్ ఎవ్వరూ అనేది ఆలోచిస్తే ముందు 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి అని చెప్పి మళ్ళీ హెబ్బా పటేల్ తెరపై కి వచ్చింది. హెబ్బా కూడా అందరితో అదే చెప్పుకుంది. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు ఈ కుమారిని మళ్ళీ తప్పించేశారు. ఈ సినిమాను తమిళ్ లో డైరెక్ట్ చేస్తున్న ఎమ్ ఎమ్ చంద్రమౌళి.. తమిళ్ మహా లక్ష్మి గా లావణ్య త్రిపాఠినే చేస్తుంది అని ఖరారు చేశాడు. లావణ్య ఈ సినిమా కోసం అప్పుడే బరువు కూడా తగ్గడం మొదలుపెట్టిందట. ఫిట్ గా కాలేజీ కి వెళ్ళుతున్న అమ్మాయిలా కనిపించడానికి తెగ వర్కవుట్లు చేసేస్తోందట.

మరి తమన్నా ఈ సినిమాలో తను కాకుండా మరెవ్వరూ చేయలేరు ఏమో అన్నంతగా చేసేసింది యాక్టింగ్. ఇప్పుడు లావణ్య ఎలా చేస్తుందో చూడాలి. ఇక్కడ నాగ చైతన్య పాత్రను మ్యూజిక్ డైరెక్టర్ నుండి నటుడుగా మరి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న జి‌వి ప్రకాష్ చేస్తున్నాడు. 100 % లవ్ తమిళ్ ప్రేక్షకులు సరిపడే డొస్ వేసి చిత్రం షూటింగ్ మొదలుపెడతారట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/