Begin typing your search above and press return to search.
3 కోట్ల ఫైన్.. లావణ్య ఏమందంటే..
By: Tupaki Desk | 31 Oct 2017 5:17 PM GMTటాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఫైనల్ గా హిట్టు కొట్టేసింది. రామ్ - ఉన్నది ఒకటే జిందగి లో మెరిసి పర్వాలేదు అనిపించింది. గత కొంతకాలంగా అమ్మడికి హిట్టు దొరక్క చాలా సతమతమైంది. అంతే కాకుండా వివాదాలు కూడా ఆమెను చుట్టు ముట్టాయని అందరూ అనుకున్నారు.
ముఖ్యంగా కోలీవుడ్ నిర్మాతల మండలి మూడు కోట్ల వరకు ఫైన్ వేసినట్లు అనేక వార్తలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం 100% లవ్ తమిళ్ రీమేక్ కి సైన్ చేసి డేట్స్ విషయంలో నిర్మాతలకి ఆగ్రహం తెప్పించిందని దీంతో ఆమెను సినిమా నుంచి తప్పించారని అన్నారు. ఆ తరువాత ఆమెను 3 కోట్లమంటూ సదరు సినిమా నిర్మాతలు తమిళ నిర్మాత మండలిని ఎప్రోచ్ అయినట్లు రూమర్ వచ్చింది. కానీ లావణ్య మాత్రం ఆ విషయాలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. సరిగ్గా అందరూ ఆ విషయం గురించి మర్చిపోతున్న సమయంలో అమ్మడు సడన్ గా క్లారిటీ ఇచ్చింది.
అలాంటిదేమి లేదని చెబుతూ.. కేవలం క్యాస్టింగ్ విషయంలో మాత్రమే తేడా రావడంతో తప్పుకున్నానని చెప్పింది. ఇక ఫైన్ వేసినట్టు నోటీసులు గాని తనకు ఏమి అందలేదని కూడా లావణ్య క్లియర్ గా వివరించింది. ఇక అమ్మడు సెట్ కాకపోవడంతో 100% కాదల్ లో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే ను ఎంచుకున్న విషయం తెలిసిందే.