Begin typing your search above and press return to search.

అందాల రాక్షసి ముద్దుల ప్రేమ

By:  Tupaki Desk   |   28 Sept 2017 11:06 PM IST
అందాల రాక్షసి ముద్దుల ప్రేమ
X
లావణ్య త్రిపాఠి ఇప్పుడు టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీస్ లో టాప్ లో ఉంటుంది. నాగార్జున లాంటి సీనియర్ హీరో నుంచి నాని.. చైతు.. శిరీష్.. రామ్ వంటి కుర్ర హీరోల కూడా పక్కన కూడా నటించి మెప్పించేయగల ట్యాలెంట్ ఈమె సొంతం. వరుసగా అందుతున్న పెద్ద హిట్లు.. భారీ చిత్రాలు అమ్మడి రేంజ్ ను అంతకంతకూ పెంచుతూనే ఉన్నాయి.

కెరీర్ ఇలాంటి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో.. తను ప్రేమలో పడిపోయానని అంటోంది లావణ్యా త్రిపాఠి. అలాగని ఆమె తన లైఫ్ పార్ట్నర్ ను వెతుక్కుని ప్రేమలో పడిపోలేదు. ఓ చిన్నారితో ప్రేమలో పడిపోయిందట. నిజానికి ఆ బుజ్జాయి పుట్టకముందే తనతో ప్రేమలో పడిపోయానని చెప్పి.. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లావణ్య. క్యూటీ అని తెగ ముద్దులాడేస్తూ.. తన ఒళ్లోకి ఆ చిన్నారి తీసుకుని.. పొదివి పట్టుకుని.. ఎంతో ఆప్యాయంగా ఓ ఫోటోకు పోజ్ ఇచ్చింది లావణ్య. ఆ చిన్నారి కూడా అంతే ఆసక్తిగా కెమేరా వంక గమనిస్తుండడం.. ఫోటోకు మరింత అందాన్ని ఇచ్చింది.

అయితే.. మరి చిన్నారి ఎవరు.. ఎవరితో లావణ్య ప్రేమలో పడింది.. పుట్టకముందే ప్రేమలో పడిపోవడానికి.. ఆ బుడతకు ఈ అందాల రాక్షసికి లింక్ ఏంటనే విషయాన్ని మాత్రం ఈ హీరోయిన్ బయటపెట్టలేదు. ఇక లావణ్య సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా యుద్ధం శరణంతో ఆడియన్స్ ను పలకరించిన ఈమె.. త్వరలో ప్రాజెక్ట్ జెడ్.. ఉన్నది ఒకటే జిందగీ మూవీస్ తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.