Begin typing your search above and press return to search.
లావణ్యకు రిలీఫ్ ఇచ్చారుగా...
By: Tupaki Desk | 16 March 2018 4:29 AM GMTఅందాల రాక్షసిలో మన పక్కింటమ్మాయి లాగే అనిపించే పాత్రలో ఎంతో అందంగా కనిపించి.. భలే మగాడివోయ్ తన స్మయిల్ తో మైమరిపిచింది నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. తరవాత వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. ఎందుకో తనకు పేరు తెచ్చిన హోమ్లీ లుక్ ను కాదని గ్లామర్ గా కనిపించడానికి బాగా ట్రై చేసింది. ఆ ప్రయత్నాలు క్లిక్ అవకపోగా అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.
ప్రస్తుతం చేతిలో పెద్ద సినిమాలేవీ లేక డీలాపడ్డ లావణ్యకు అనుకోకుండా రవితేజ సినిమాతో రిలీఫ్ వచ్చింది. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే ఈ మూవీలో లావణ్య హీరోయిన్ గా ఎంపికైంది. ముందు ఈ పాత్రకు క్యాథరిన్ థ్రెసాను తీసుకుందామని చిత్ర యూనిట్ అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆ అవకాశం లావణ్యను వరించింది. డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇంతవరకు రవితేజ పక్కన కనిపించని హీరోయిన్ తీసుకుందామని అనుకోవడం లావణ్యకు కలిసొచ్చింది.
రవితేజ లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు లో హీరోయిన్ గా ముందు లావణ్యనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఈ ప్రాజెక్టులో ఎంటర్ కాలేదు. ఆ మూవీ ఎలాగూ ఫ్లాప్ అయింది. ఒకవేళ అందులో నటించి ఉంటే ఈ అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. ఈ సినిమాలో గ్లామర్ గా కనిపిస్తుందో.. హోమ్లీగా మురిపిస్తుందో చూడాలి.