Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మిసమిసలాడుతున్న లావణ్యం

By:  Tupaki Desk   |   13 Sep 2018 11:00 AM GMT
ఫోటో స్టొరీ: మిసమిసలాడుతున్న లావణ్యం
X
'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల సుందరి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముంబై భామ హిట్లతో.. ఫ్లాపులతో పడుతూ లేస్తూ తెలుగు సినీ ప్రయాణం సాగిస్తోంది. అలా అని అవకాశాలు లేవనుకోకండి. నిఖిల్ 'ముద్ర' తో పాటుగా వరుణ్ 'అంతరిక్షం' లో కూడా గ్లామర్ సందడి ఈ బ్యూటీ దే.

గ్లామర్ తో సందడి చేసేందుకు ఒక్క సినిమాలేనా వేదిక? ఇన్ స్టాగ్రామ్ కూడా సూపర్ వెన్యూనే కదా. అందుకే అక్కడ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ పండగ చేసుకుంటోంది. మిగతా బ్యూటీ ల మాదిరిగా మిలియన్లలో ఈ త్రిపాఠికి ఫాలోయర్లు లేరు. ఒక మిలియన్ కంటే కాస్త నంబర్ తక్కువగా ఉంది. అందుకే కాస్త ఫాలోయర్స్ నంబర్ పెంచుకునే పనిలో ఉన్నట్టుంది. తాజాగా లావణ్య పోస్ట్ చేసిన ఫోటోలో ఆమె చిట్టి పొట్టి బట్టల్లో కనిపించింది.

ఒక మినీ జీన్స్ నిక్కర్.. సారీ.. దాన్ని మైక్రో అనాలి. ఇక పైన ఇన్నర్ గార్మెంట్స్ కన్పించేలా ఒక పారదర్శకంగా ఉన్న వైట్ ఫుల్ షర్టు వేసుకుంది. ఇక షర్టు మాత్రమే కాకుండా ఫోటో కూడా బ్రైట్ గా ఉంది. ఇక ఈ బ్రైట్ నెస్ తో పాటుగా అందంగా నవ్వుతూ నెటిజనులపై శృంగార బాణాలను వేస్తోంది. ఈ మిసమిసలాడుతున్న లావణ్యం ఫోటో కు ఆమె పెట్టిన క్యాప్షన్ ఏంటంటే "చిరునవ్వు నవ్వడం అనేది నాకిష్టమైన పని #హ్యాపీ గర్ల్స్ ఆర్ ది ప్రెట్టియెస్ట్." నిజమే కదా ఎంత అందమైన పిల్ల అయినా మొహం ఏడ్చినట్టు పెడితే ఎలా అందంగా కనిపిస్తుంది.. నవ్వితేనా కదా అందం. అప్పుడే కదా అబ్బాయిలు పిచ్చోళ్ళయ్యేది!