Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: క్యూట్ బ్యూటీ వెరైటీ పోజు

By:  Tupaki Desk   |   11 April 2019 11:22 AM GMT
ఫోటో స్టొరీ: క్యూట్ బ్యూటీ వెరైటీ పోజు
X
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఈమధ్య అస్సలేమీ కలిసి రావడం లేదు. 2017 నుంచి ఇప్పటివరకూ వరసగా అరడజను ఫ్లాపులతో డీలా పడిపోయింది. అయినా ఆ ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది లావణ్య.

ఈ ఫోటోకు లావణ్య ఇచ్చిన క్యాప్షన్ "నేను వెతికేది అంతులేని సంతోషం ఉండే జీవితం కోసమే." పూల డిజైన్ ఉండే ఒక థై-స్లిట్ గౌన్ ధరించిన లావణ్య ఒక వెరైటీ పోజిచ్చింది. ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టుగా రెండు చేతులు తలవెనక పెట్టుకొని పాలరాతి శిల్పంలా నిలబడింది. ఎంతైనా అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కదా.. పోజు ఎలా ఉన్నా అందం మాత్రం పోత పోసినట్టుగా ఉంది. లావణ్య ఫాలోయర్లకు ఈ ఫోటో బాగానే నచ్చింది. ఒకరు 'బ్యూటీ క్వీన్' అని పొగిడితే మరొకరు 'సో హాట్' అన్నారు. ఇంకొకరు 'క్యూట్ బ్యూటీ' అని కితాబిచ్చారు.

లావణ్య ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే నిఖిల్ తో 'అర్జున్ సురవరం' సినిమాలో నటిస్తోంది. మే 1 న రిలీజ్ కానున్న ఈ సినిమా విజయంపై లావణ్య చాలా నమ్మకం పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే మునుపటిలా మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో.