Begin typing your search above and press return to search.

అరడజను ఫ్లాపులు.. ఆశలన్నీ ఆ సినిమాపైనే!

By:  Tupaki Desk   |   18 April 2019 4:19 PM GMT
అరడజను ఫ్లాపులు.. ఆశలన్నీ ఆ సినిమాపైనే!
X
'అందాల రాక్షసి' సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది. 'భలే భలే మగాడివోయ్'.. 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండడంతో ఆఫర్లు కూడా ఫుల్లుగానే వచ్చాయి. కానీ 2016 లో 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత లావణ్యకు హిట్ అన్నదే లేదు. ఈ రెండేళ్ళ కాలంలో ఆరు తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో లావణ్య కెరీర్ ఇప్పుడు నిరాశాజనకంగా ఉంది.

లావణ్య చేతిలో ఇప్పుడు ఒకే సినిమా ఉంది. అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ సురవరం'. ఈ సినిమా కనుక హిట్ అయితే లావణ్యకు తన కెరీర్లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమా కనుక నిరాశపరిస్తే మాత్రం లావణ్య కెరీర్ ఇక చివరి దశకు వచ్చినట్టే. అందుకే ఈ సినిమా విజయంపై లావణ్య భారీగా నమ్మకం పెట్టుకుంది. తమిళ సూపర్ హిట్ 'కనిదన్' కు రీమేక్ గా తెరకెక్కిన సినిమా కావడంతో కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. లావణ్యకు రిలీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా 'అర్జున్ సురవరం' ఫలితం లావణ్య కు లిట్మస్ టెస్ట్ లాంటిదే.

సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తమిళ ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు టీ సంతోష్ 'అర్జున్ సురవరం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'అర్జున్ సురవరం' మే 1 న రిలీజ్ కానుంది.