Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అంత హాట్ నెస్ ఎలా.. ఎలా?

By:  Tupaki Desk   |   26 May 2019 8:04 AM GMT
ఫోటో స్టొరీ: అంత హాట్ నెస్ ఎలా.. ఎలా?
X
మొదటి సినిమాతో గుర్తింపు సాధించడం అనేది అరుదుగా జరుగుతుంది. లావణ్య త్రిపాఠి కెరీర్లో మాత్రం అలాగే జరిగింది. మొదటి సినిమా 'అందాల రాక్షసి' హిట్ కాలేదు కానీ లావణ్యకు కావలసినంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్'.. 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండడంతో ఆఫర్లు కూడా ఫుల్లుగానే వచ్చాయి. అయితే 2016 లో 'శ్రీరస్తు శుభమస్తు' లావణ్యకు లాస్ట్ హిట్. ఆ సినిమా తర్వాత లావణ్య నటించిన ఆరు సినిమాలు నిరాశపరిచాయి. కెరీర్ స్లో అయిందే కానీ సోషల్ మీడియాలో అమ్మడి జోరు తగ్గలేదు.

తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ప్రేమపై.. సత్యంపై మీ వెలుగును ప్రసరించనివ్వండి.. మీ ఆత్మ ప్రకాశిస్తుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది లావణ్య. ఈ రేంజ్ డీప్ ఫిలాసఫీ మన నెటిజనులలో ఎంతమందికి అర్థం అవుతుందో ఏమో కానీ ఆమె పోస్ట్ చేసిన ఫోటో మాత్రం వయోభేదం లేకుండా.. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరికీ చక్కగా అర్థం అవుతుంది. ఎందుకంటే అందం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా? ఒక లైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ శాటిన్ గౌన్ ధరించి దాన్ని అత్యంత సెక్సీగా ధరించి.. అంతకంటే సెక్సీగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. లూజ్ హెయిర్.. మినిమమ్ మేకప్ తో నిజమైన అందాల రాక్షసిగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు ట్విట్టర్లో కామెంట్లు అదిరిపోయాయి. ఒకరు "అంత హాట్ నెస్ ఎలా.. ఎలా?" అన్నారు. మరొకరు "స్వర్గం నుండి ఒక దేవత తప్పిపోయి ఇక్కడికి వచ్చింది" అన్నారు. ఇంకొకరు 'వెరీ హాట్ మేడమ్ జీ' అన్నారు. ఒక నెటిజనుడు మాత్రం "ఆ కోట్ కు ఈ ఫోటో కు సంబంధం ఏంటో ఎవరైనా చెప్పండి" అన్నాడు. నిజమే.. సెంటిమీటర్ కూడా సంబంధం లేదు.. అలా సంబంధం లేకుండా ఉన్నవి క్లిక్ కావడమే జీవితం! ఇక లావణ్య సినిమాల విషయానికి వస్తే నిఖిల్ 'అర్జున్ సురవరం' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా హిట్ అవుతుందని మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతానని లావణ్య నమ్మకంగా ఉంది.