Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: రాక్షసి.. సర్జికల్ స్ట్రయిక్స్

By:  Tupaki Desk   |   30 May 2019 7:35 AM GMT
ఫోటో స్టొరీ: రాక్షసి.. సర్జికల్ స్ట్రయిక్స్
X
అందాల రాక్షసి' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు అందాల రాక్షసిగా మారిపోయింది లావణ్య త్రిపాఠి. మొదట్లో కెరీర్ జోరుగా సాగింది కానీ ఈమధ్య మాత్రం వరస ఫెయిల్యూర్లతో జోరు తగ్గింది. అయితే కెరీర్ స్లో అయిందని నిరాశచెందకుండా లావణ్య సోషల్ మీడియాలో మంటలు రేపుతూ గ్లోబల్ వార్మింగ్ కు తన వంతుగా సాయం చేస్తోంది. మొదట్లో పక్కింటి అమ్మాయి పాత్రలు చేసి డీసెంట్ అనిపించుకున్న లావణ్య తర్వాత కాలంలో హాటు యాంగిల్ ని బైటకు తీసి అందరినీ టీజ్ చేస్తోంది.

తాజాగా లావణ్య ఒక క్రేజీ ఫోటోషూట్ చేసింది. బ్లూ జీన్స్.. వైట్ కలర్ టాప్ వేసుకున్న లావణ్య ఒక సోఫాపై కూర్చుంది. జీన్స్ ప్యాంట్ జిప్ వేసుకుంది కానీ బటన్ పెట్టుకోలేదు. లేసుల డిజైన్ లో ఉన్న టాప్ కావడంతో లావణ్య అందం డబల్ అయింది. ఆ కూర్చున్న పోజు.. మొహంలో ఎక్స్ ప్రెషన్ మాత్రం ఈ కాలపు ఐటెం భామలందరినీ మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. లావణ్య త్రిపాఠి ఇప్పటివరకూ ఎన్నో ఫోటో షూట్లు చేసి ఉంటుంది కానీ ఇప్పటివరకూ ఇంత హాట్ ఫోటో షూట్ మాత్రం చేసి ఉండదు. ఒక చేతిని కింద పెట్టుకొని మరొక చేతిని జుట్టును సవరించుకున్నట్టుగా తలను వెనకకు వంచి.. కళ్ళు మూసుకొని హాటెస్ట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటి అంటే చెప్పడం చాలా కష్టం. ఒకటి కాదు పది ఉన్నాయి. అయితే నంబర్ వన్ హైలైట్ మాత్రం రాక్షసి నాభి సౌందర్యమే.

ఇలా గ్లామర్ షోలు కంటిన్యూ చేస్తే మాత్రం ఫిలిం మేకర్లు మళ్ళీ లావణ్యకు కొత్త కొత్త ఆఫర్లు ఇవ్వడం ఖాయమే. ప్రస్తుతానికికైతే లావణ్య చేతిలో ఒకే సినిమా ఉంది. అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ సురవరం'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.