Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మోడరన్ రాక్షసి

By:  Tupaki Desk   |   14 Sep 2019 6:42 AM GMT
ఫోటో స్టొరీ: మోడరన్ రాక్షసి
X
లావణ్య త్రిపాఠి కెరీర్ ఇప్పుడైతే కాస్త స్లో అయ్యింది కానీ ఒక ఏడాది క్రితం వరకూ ఫుల్ జోష్ లో ఉండేది. మొదటి సినిమా 'అందాల రాక్షసి' తోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించిన లావణ్యకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చాయి. ఇక 'భలే భలే మగాడివోయ్' లాంటి సినిమాలు లావణ్య కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాయి. అయితే లావణ్యకు లాస్ట్ సూపర్ హిట్ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఆ సినిమా తర్వాత లావణ్య హిట్ అనే పదానికి దూరమైంది.

ఎలాంటి హీరో హీరోయిన్లకైనా కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమే. అందుకేనెమో మరి అవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో లావణ్య తనదైన శైలిలో చెలరేగిపోతోంది. తనకున్న అందాల రాక్షసి బిరుదును సార్థకం చేసుకుంటోంది. రీసెంట్ గా భామ ఒక ఈవెంట్ కు హాజరైంది. బ్లూ కలర్ సూట్ డిజైన్ లో ఉన్న గౌన్ ధరించి.. రెడ్ కలర్ లిప్ స్టిక్.. రెడ్ కలర్ బ్యాగ్ తో చూపరులను ఆకర్షించింది. అదేంటోకానీ మొదటి నుంచి లావణ్యకు ట్రెడిషనల్ గర్ల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలని ఎన్ని హాటు ప్రదర్శనలిచ్చినా ఇప్పటివరకూ బైటకు రాలేకపోయింది. అయితే తన స్టైలిష్ అవుట్ ఫైట్స్ తో 'నేను మోడరన్' అని సభ్య సమాజానికి స్టైల్ సందేశం ఇస్తూ ఉంటుంది.

ఇక లావణ్య సినిమాల విషయానికి వస్తే నిఖిల్ తో నటించిన 'అర్జున్ సురవరం' రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా పోయినేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే గత కొన్ని నెలల నుంచి 'అర్జున్ సురవరం' టీమ్ నుంచి రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ లేనే లేదు.