Begin typing your search above and press return to search.

స్లో అండ్ స్ట‌డీగా ఆలోచిస్తేనే నీ గ‌మ్యం ఎటో తెలిసేది!

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:30 PM GMT
స్లో అండ్ స్ట‌డీగా ఆలోచిస్తేనే నీ గ‌మ్యం ఎటో తెలిసేది!
X
పాస్ అండ్ రిమెంబ‌ర్.. స్లో అండ్ స్ట‌డీగా ఆలోచిస్తేనే నీ గ‌మ్యం ఎటో తెలిసేది! అంటూ అద్భుత‌మైన కొటేష‌న్ నే చెప్పింది అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి. ఈ డెహ్రాడూన్ బ్యూటీ ఆల్మోస్ట్ హైద‌రాబాద్ లోనే సెటిలైపోవ‌డానికి కార‌ణం త‌న గ‌మ్యం ఏమిటో క‌నిపెట్టేసింది కాబ‌ట్టే.

ఇక ఇక్క‌డే తెలుగు సినిమాల్ని ఏలాల‌నే క‌లలు గంటోంది. అగ్ర క‌థానాయిక హోదాని అందుకోవాల‌ని వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్లు ప‌ట్టేయాల‌ని తెగ క‌లలు కంటోంది. అయితే క‌లలు క‌నాలి వాటిని సాధించ‌డానికి శ్ర‌మించాలి! అన్న అబ్ధుల్ క‌లాం సూక్తిలాగా... అంతే శ్ర‌మిస్తోంది క‌ల‌ల్ని సాధించేందుకు. కానీ ఏదీ అంత వీజీగా లేదు. ప్ర‌తిదీ అంద‌ని ద్రాక్ష పుల్ల‌న అన్న తీరుగానే ఉందిక్క‌డ‌.

ఇంత‌వ‌ర‌కూ ఒక్క నాగార్జున త‌ప్ప వేరొక స్టార్ హీరో ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో కుర్ర‌హీరోల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంది. అప్పుడ‌ప్పుడు నిర్మాత‌ల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నా స్నేహ పూర్వ‌కంగా ఆన్ లొకేష‌న్ క‌మిట్ మెంట్లు పూర్తి చేస్తోందని గుస‌గుస‌లు ఉండ‌నే ఉన్నాయ్. తాజాగా జిమ్ లో స్వేదం చిందించేందుక‌ని వెళ్లి కాస్త తీరిగ్గానే ఇదిగో ఇలా కొటేష‌న్లు ఇస్తోంది. ఇలాంటి టెక్నిక్స్ అన్నిటినీ న‌ట‌న‌లో చూపిస్తే బావుంటుందేమో రాక్ష‌సీ.