Begin typing your search above and press return to search.
డిజాస్టర్ల హ్యాట్రిక్ కొట్టేసిందిగా..
By: Tupaki Desk | 10 Sep 2017 5:30 PM GMTతొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే కథానాయికగా బలమైన ముద్ర వేసింది లావణ్య త్రిపాఠి. ఐతే ఆమె కెరీర్ ఊపందుకోవడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ రెండేళ్లుగా మంచి మంచి అవకాశాలు అందుకుంటే స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా అడుగులు వేస్తోంది లావణ్య. గత ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన లావణ్య.. ఆ తర్వాత ‘శ్రీరస్తు శుభమస్తు’తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు పెరిగాయి. క్రేజీ ప్రాజెక్టులు చేతికొచ్చాయి. లావణ్య కోరుకుంటున్న స్టార్ స్టేటస్ ఎంతో దూరంలో లేదనే అనిపించింది. కానీ ఈ ఏడాది విడుదలైన మూడు సినిమాలు ఆమెను బాగా వెనక్కి లాగేశాయి.
ఈ ఏడాది సమ్మర్లో ‘రాధ’.. ‘మిస్టర్’ లాంటి డిజాస్టర్లు లావణ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చితే.. ఈ శుక్రవారం విడుదలైన ‘యుద్ధం శరణం’తో ఆమె డిజాస్టర్ల హ్యాట్రిక్ పూర్తి చేసింది. గతంతో పోలిస్తే మరింత గ్లామరస్ గా కనిపిస్తూ సినిమా సినిమాకూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్న లావణ్య.. బయట కూడా హాట్ హాట్ ఫొటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది. కెరీర్ ఆరంభంలో పడ్డ ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్రను తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. కానీ ఏం చేస్తాం.. ఆమె సినిమాలు మాత్రం వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. ఒక హీరోయిన్ ఎంత టాలెంట్ చూపించినా.. ఎంత ఆకర్షణీయంగా కనిపించినా.. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయంటే ఆ ఫ్లాపుల తాలూకు క్రెడిట్ ను హీరోయిన్లకు అంటించేసి ఐరెన్ లెగ్ ముద్ర వేసేసే ఇండస్ట్రీ మనది. ఈ నేపథ్యంలో లావణ్య కెరీర్ ఎలాంటి స్థితికి చేరుకుంటుందో చూడాలి.