Begin typing your search above and press return to search.
ఆమెతో అడ్జస్టవుతున్న వైట్ట
By: Tupaki Desk | 28 Feb 2016 4:38 AM GMTఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే ఆ వ్యవహారమే వేరుగా ఉండేది. స్టార్ హీరో.. బడా హీరోయిన్.. పెద్ద నిర్మాత.. భారీ బడ్జెట్.. భారీ తారాగణం.. మొత్తంగా సినిమా రేంజే వేరన్నట్లుండేది. కానీ వరుసగా రెండు డిజాస్టర్లు ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకేసారి చాలా మెట్లు దిగొచ్చి.. మీడియం రేంజి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణంలో ఒకప్పటి ‘రెడీ’ తరహాలో ఓ మోస్తరు బడ్జెట్ లో సినిమా చేయబోతున్నాడు వైట్ల. ఈ సినిమాకు మిగతా తారాగణం ఎంపికలోనూ వైట్ల కొంచెం అడ్జస్టవ్వక తప్పేలా లేదు.
వరుణ్ స్థాయికి తగ్గట్లే మీడియం రేంజి హీరోయిన్లనే చూడాల్సి వస్తోంది. ఈ రేంజి హీరోయిన్లలో చాలా పేర్లు పరిశీలించి చివరికి లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారట. భలే భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్నినాయనా లాంటి హిట్లు కొట్టినప్పటికీ లావణ్య రేంజేమీ పెరిగిపోలేదు. ఆమె ఇప్పటికీ ఓ మోస్తరు హీరోయినే. ఇక మిగతా నటీనటుల విషయంలోనూ వైట్ల తన స్థాయిని తగ్గించుకుంటున్నట్లు సమాచారం. బడ్జెట్ కూడా ఓ స్థాయి దాటకపోవచ్చని అంటున్నారు. స్క్రిప్టు వర్క్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో తారాగణం ఎంపిక పూర్తవుతుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.