Begin typing your search above and press return to search.
రాక్షసి ఫోన్లో ఏ ఫోటో ఉందంటే...
By: Tupaki Desk | 3 Feb 2018 11:00 PM ISTఅందాల రాక్షసిగా పరిచయం అయ్యి మన అందరినీ అలరిస్తున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. గతేడాది కాస్త కాలం కలిసి రాలేదు కానీ.. ఇప్పటికీ ఫుల్ ఫామ్ లోనే ఉంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈ భామ ఓ సెన్సేషనల్ విషయాన్ని షేర్ చేసింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనను ఫాలో కావడాన్ని చూసి షాక్ తినేసిన విషయాన్ని వెంటనే అందరికీ షేర్ చేసేసింది. బిగ్ బీ తనను ఫాలో అవుతున్నట్లు వచ్చిన నోటిఫికేషన్ ను చూపించేందుకు.. తన మొబైల్ ఫోన్ తెరను స్క్రీన్ షాట్ తీసి మరీ చూపించింది లావణ్య త్రిపాఠి. అయితే.. ఈ స్క్రీన్ షాట్ తో మరో విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ భామ మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్ ఏంటో కనిపించేసింది. ఆ నోటిఫికేషన్ వెనకాల కనిపిస్తున్న ఇద్దరూ ఎవరో కాదు.. ఆమె అమ్మా నాన్నలే. తనను కన్న తల్లిదండ్రుల ఫోటోనే వాల్ పేపర్ గా పెట్టుకుని.. ఫోన్ ఆన్ చేసినపుడల్లా వారు కనిపించేలా సెట్ చేసుకుంది లావణ్య త్రిపాఠి.
ఈ వాల్ పేపర్ చూస్తే చాలు.. లావణ్యకు పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఈ తరం కుర్రకారులో ఇంత సింపుల్ గా ఉండే వాళ్లు కనిపించడం కాస్త అరుదే. ముఖ్యంగా ట్రెండీ స్మార్ట్ ఫోన్స్ కాలంలో ఇలాంటి సంస్కృతి ఊహించడం కూడా కష్టమైపోయింది. కానీ అమ్మానాన్నలపై ప్రేమను చాటుతున్న ఈ అందాల రాక్షసి.. ఈ తరం కుర్రకారులో ఎంతో మందికి ఆదర్శం అనాల్సిందే.