Begin typing your search above and press return to search.
వినాయక్-తేజు సినిమాలో ఆమె
By: Tupaki Desk | 10 Aug 2017 7:04 AM GMTచాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న కాంబినేషన్ ఓకే అయింది. ఎట్టకేలకు పట్టాల మీదికి వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మాణంలో సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. తేజు తొలిసారి ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండటం.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమా ఇది కావడంతో దీనిపై జనాల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ అందించాడు. ఈ చిత్రానికి ‘దుర్గ’ అని.. ‘ఇంటలిజెంట్’ అని రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.
సినిమా ప్రారంభోత్సవం రోజు కథానాయిక.. ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల సంగతి వెల్లడించలేదు. ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుందట. ఆమె తేజు.. వినాయక్ లతో పని చేయబోతుండటం ఇదే తొలిసారి. రాధ.. మిస్టర్ లాంటి ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయినట్లు కనిపించిన లావణ్య.. ఈ మధ్య మళ్లీ బాగానే పుంజుకుంటోంది. రామ్ సరసన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న లావణ్య.. ఇప్పుడు వినాయక్-తేజుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం పట్టేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకొస్తుందట. ‘ఖైదీ నంబర్ 150’ ఎంత పెద్ద హిట్టయినప్పటికీ.. ఆ క్రెడిట్ వినాయక్ ఖాతాలోకి రాలేదు. అలాగే తేజు కెరీర్ కూడా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. లావణ్య పరిస్థితీ అంతే. కాబట్టి ఈ ముగ్గురికీ ఈ చిత్రం కీలకమే.