Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ పెంచుతానంటోంది

By:  Tupaki Desk   |   26 March 2017 9:52 AM GMT
గ్లామర్ డోస్ పెంచుతానంటోంది
X
కెరీర్ ఆరంభం నుంచి ట్రెడిషనల్ రోల్సే చేస్తూ వస్తోంది లావణ్య త్రిపాఠి. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఆమె అందాల ప్రదర్శన చేసింది లేదు. ఆమెకు కొత్తగా వస్తున్న పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయి. ఇలా మరీ పద్ధతిగా కనిపించడం వల్లే ఓ స్థాయికి మించి ఎదగలేకపోతున్నానని భావిస్తోందో ఏమో.. ఇకపై గ్లామర్ డోస్ పెంచుతానని చెప్పకనే చెబుతోంది లావణ్య.‘‘చాలా సినిమాల్లో వరుసగా సంప్రదాయమైన పాత్రలు చేశాను. అలా ఎప్పుడూ మంచి అమ్మాయిగా కనిపిస్తుంటే నాకే బోర్‌ కొడుతోంది. అన్నిరకాల పాత్రలూ చేయాలనుంది. అందుకే నన్ను ఇకపై కొత్తగా చూస్తారు’’ అని లావణ్య తెలిపింది. తనకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చని.. తెరపై అలాంటి పాత్ర కూడా చేయాలనుందని లావణ్య చెప్పింది.

ఇక తన ఇష్టాఇష్టాల గురించి ఆమె చెబుతూ.. ‘‘నాకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం. హోటల్ కు వెళ్లగానే చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇస్తాను. అందులోంచి చికెన్‌ ముక్కలన్నీ తీసేసి బిర్యానీ మాత్రం తినేస్తా. ఎదుకంటే నేను మాంసాహారం తినను మరి. ఉత్తరాది అమ్మాయినే అయినా దక్షిణాది వంటకాలే ఎక్కువ నచ్చుతాయి. ఇడ్లీ, దోశె అన్నీ ఇష్టంగా తింటాను. నా ఫోన్లో సోషల్‌ మీడియా ఆప్స్‌ అన్నీ డిలీట్‌ చేసేశా. హోటల్‌కి వెళ్లాక నా స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తాను. లేదంటే ఏదైనా పుస్తకం చదువుకుంటాను, సినిమా చూసుకుంటాను తప్పించి ఫోన్లో టైమ్‌వేస్ట్‌ చేయడం నచ్చదు. హైదరాబాద్‌లో నాకు మంచి స్నేహితులున్నారు. ఇక్కడ త్వరలోనే ఇల్లు కొనాలనుకుంటున్నా. బయట తిండి తినలేకపోతున్నాను. నాకు వంట వచ్చు. నేనే వంటచేసుకుంటా’’ అని లావణ్య తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/