Begin typing your search above and press return to search.

వెబ్ సిరీసులలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న అందాల రాక్షసి

By:  Tupaki Desk   |   5 May 2020 11:30 PM GMT
వెబ్ సిరీసులలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న అందాల రాక్షసి
X
'అందాల రాక్షసి' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది లావణ్య త్రిపాఠి. ఆకర్షణీయమైన.. మనోహరమైన రూపం ఆమె సొంతం. భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సినిమా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి అభినయానికి అవకాశమున్న పాత్రలనే ఎంచుకుంటూ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ డెహ్రాడూన్ భామ. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా నటిస్తూ బిజీగా మారుతోంది. గతేడాది వచ్చిన 'అర్జున్ సురవరం' హిట్ తో మంచి ఊపు మీదున్న లావణ్య సందీప్ కిషన్ సరసన 'ఏ1 ఎక్సప్రెస్' మరియు కార్తికేయతో కలిసి 'చావు కబురు చల్లగా' చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో యువ హీరో అథర్వ సరసన ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే లావణ్య అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. కుదిరినప్పుడల్లా ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లను అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. డిజిటల్ మీడియాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చిందట. మంచి కంటెంట్ తో తన దగ్గరికి వస్తే నటించడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చిందట. రాబోయే రోజుల్లో తనని వెబ్ సిరీస్ లలో చూడొచ్చని తెలిపిందట. నిజానికి ప్రస్తుతం అందరూ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. మన తెలుగులో కూడా వెబ్ కంటెంట్ హవా పెరగడంతో స్టార్ హీరో హీరోయిన్లు సైతం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సమంత, ప్రియమణి, కియారా లాంటి స్టార్ హీరోయిన్లు ఆ వైపుగా అడుగులు వేశారు. హెబ్బా పటేల్, ఇషా, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, శ్రీకాంత్ మొదలైన వారు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అక్కడ కూడా నిరూపించడానికి ట్రై చేస్తున్నారు.