Begin typing your search above and press return to search.

అవసరమైతే 'బికినీ'కి సిద్ధం..అంటున్న అందాల రాక్షసి

By:  Tupaki Desk   |   1 May 2020 11:30 PM GMT
అవసరమైతే బికినీకి సిద్ధం..అంటున్న అందాల రాక్షసి
X
'అందాలరాక్షసి' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది డెహ్రడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే తన అమాయకత్వంతో అభినయంతో ఆకట్టుకున్న లావణ్య.. కెరీర్ తొలినాళ్లలో స్టార్ స్టేటస్ అందుకునేలానే కనిపించింది. ఆ తరువాత వరుస పరాజయాలతో ఈ అమ్మడు వెనుక పడిపోయింది. ఇక ఈ హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని అనుకున్నారంతా. భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్ని నాయనా హిట్లతో అభినయానికి అవకాశమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. కానీ చాలా గ్యాప్ తరువాత ఇటీవలే 'అర్జున్ సురవరం' విజయం మళ్లీ ఈ 'అందాల రాక్షసి'ని సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.

ఇన్నేళ్ళుగా లావణ్య ఒక్కసారి కూడా టాప్ లిస్టులో అడుగు పెట్టలేకపోయింది. ఇక తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాల విందు ఆరంభించింది. ప్రస్తుతం లావణ్య యువ కథానాయకులతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు ఇటీవలే తమిళంలో 'వాల్మీకి' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో హీరోయిన్‌గా ఫైనలయింది. ఇటీవల అవసరమైతే బికినీ అందాలను ఆరబోయడానికి తాను సిద్ధమంటోంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు భారీ డిమాండ్ ఉందని, మంచి స్క్రిప్టు దొరికితే తాను కూడా నటించేందకు రెడీ అంటోంది ముద్దుగుమ్మ. మరి లావణ్య సినిమాలలో అయినా డిజిటల్ లో అయినా మమ్మల్ని అలరిస్తే చాలంటున్నారు ఫ్యాన్స్.