Begin typing your search above and press return to search.

హ్యాపీగా జిమ్ చేసుకుంటుంది..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 2:47 AM GMT
హ్యాపీగా జిమ్ చేసుకుంటుంది..!
X
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఆమెలో ఉన్న మంచి నటిని ఎవరు సరిగా వాడుకోవట్లేదనే చెప్పాలి. దశాబ్ద కాలం క్రితం వచ్చిన అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాఖండ్ భామ వచ్చిన ప్రతి అవకాశం చేస్తూ వస్తుంది. స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డ అమ్మడు యువ హీరోలకు మాత్రం ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోయిన్స్ ఈమధ్య సోషల్ మీడియా క్రేజ్ తో అదరగొడుతున్నారు. చేతుల్లో సినిమాలు ఉన్నా లేకపోయినా సరే ఫోటో షూట్స్ మాత్రం అసలు మిస్ చేయట్లేదు.

రీసెంట్ గా హ్యాపీ బర్త్ డే అంటూ ఒక సస్పెన్స్ విత్ ఎంటర్టైనర్ కామెడీతో వచ్చిన లావణ్య త్రిపాఠి ఆ మూవీతో కూడా నిరాశపరచింది. అయినా కూడా అమ్మడు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. సినిమాలు ఎలాగు లేవు కాబట్టి తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన అమ్మడు ఎక్కువ టైం ని జిమ్ లో గడుపుతుంది.

లేటెస్ట్ గా జిమ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి అక్కడ కూడా తన హాట్ లుక్స్ తో అలరిస్తుంది. ఈతరం హీరోలకు ఈక్వల్ గా హీరోయిన్స్ కూడా జిమ్ లో ఎక్కువ టైం గడుపుతున్నారు. ఆడియన్స్ ని అలరించే అందాన్ని మెయింటైన్ చేయాలంటే ఆమాత్రం చేయక తప్పదు.

అందరితో పాటుగా లావణ్య కూడా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ తన ఫిట్ నెస్ మీద.. ఫిగర్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎప్పుడు ఎలాంటి ఆఫర్ వచ్చినా దానికి రెడీగా ఉండాలనే ఉద్దేశంతో లావణ్య తన లుక్స్ విషయంలో జాగ్రత్త పడుతుంది. ఇక ఇన్నాళ్లు గ్లామర్ షోకి దూరంగా ఉన్న అమ్మడు ఇక మీదట దానికి సిద్ధమని హింట్ ఇస్తుంది. సినిమాల్లో స్కిన్ షో చేయకపోయినా తన సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న లావణ్య ఇక మీదట సినిమాల్లో కూడా తన హాట్ లుక్స్ తో అలరించాలని ఫిక్స్ అయ్యింది.

ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. వాటి గురించి త్వరలో ఎనౌన్స్ మెంట్ రాబోతుందట. కమర్షియల్ సినిమాలతో పాటుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా లావణ్య రెడీ అంటుంది. ప్రయోగాలు చేసేందుకు కూడా అమ్మడు రెడీ అంటూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.