Begin typing your search above and press return to search.

వీడియో: ఆ గ‌ది కార్న‌ర్ లో లావ‌ణ్యం ఫిక‌రేంది?

By:  Tupaki Desk   |   3 April 2021 4:19 PM GMT
వీడియో: ఆ గ‌ది కార్న‌ర్ లో లావ‌ణ్యం ఫిక‌రేంది?
X
అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ డైల‌మా గురించి తెలిసిందే. ఇటీవ‌ల ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆ రెండు సినిమాలు డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో ఈ భామ‌కు టాలీవుడ్ లో మ‌ళ్లీ ఆఫ‌ర్లు ఎలా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సందీప్ కిషన్ స్పోర్ట్స్ డ్రామా ఏ1 ఎక్స్ ప్రెస్ డ్రై మూవీ అనుకున్నా .. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరి అని చెప్పుకున్న చావు క‌బురు చ‌ల్ల‌గా కూడా అంతే తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

అయితే లావ‌ణ్య మాత్రం ఆ నిరాశ‌ను త‌న ద‌రి చేర‌నివ్వ‌కుండా త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉందిట‌. ఇక సోష‌ల్ మీడియాల వేదిక‌గా త‌న అభిమానుల‌కు నిరంత‌ర ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటోంది. తాజాగా లావ‌ణ్య షేర్ చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియో అంత‌ర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. అంత‌గా ఈ వీడియోలో ఏం ఉంది? అన్న‌ది చూడాల‌నుకుంటే.. ఇదిగో ఇది మీకోస‌మే.

త‌న ఇంటి గ‌దిలో ఒక సుంద‌ర‌మైన కార్న‌ర్ ప్లేస్ ని ఎంపిక చేసుకుని అక్క‌డ కొన్ని సెక‌న్ల పాటు సాలిడ్ డ్యాన్స్ మూవ్స్ తో రాక్ష‌సి ర‌క్తి క‌ట్టించింది. హ్యాండ్ మూవ్ మెంట్స్ కి త‌గ్గ‌ట్టే అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టి ప‌డేసింది. ఆ బ్లూ డెనిమ్ జీన్స్ కి కాంబినేష‌న్ గా తేలియాడే చిట్టి పొట్టి టాప్ ని ధ‌రించిన లావ‌ణ్య బోల్డ్ లుక్ ఇంప్రెస్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో యూత్ లో వైర‌ల్ గా మారింది.

2012లో అందాల‌రాక్ష‌సి చిత్రంతో కెరీర్ ప్రారంభించిన లావ‌ణ్య ఇప్ప‌టికే 20 పైగా చిత్రాల్లో న‌టించేసింది. ఇక‌పై కెరీర్ జ‌ర్నీ ఎలా సాగనుందో వేచి చూడాలి.