Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: ఈ అందానికి అవకాశాలివ్వరా?

By:  Tupaki Desk   |   10 April 2018 8:58 AM GMT
ఫొటో స్టోరీ: ఈ అందానికి అవకాశాలివ్వరా?
X
అందం.. అభినయం రెండూ ఉన్నప్పటికీ అదృష్టం కూడా తోడైతేనే సినీ పరిశ్రమలో ఉన్నత స్థానాలకు ఎదగగలరు ఎవరైనా. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అదృష్టం బాగా కలిసి రావాలి. ఎందుకంటే ఏ పాత్రను.. ఏ సినిమాను ఎంచుకోవాలనేది వాళ్ల చేతుల్లో ఉండదు. చేతికొచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పుకోవాలి. కానీ సినిమా ఫలితం తేడా వస్తే మాత్రం హీరోయిన్లపై ఎఫెక్ట్ మాత్రం బాగా పడుతుంది. వరుసగా రెండు మూడు ఫ్లాపులొస్తే నెగెటివ్ ముద్ర పడిపోతుంది. ఐరెన్ లెక్ అనేస్తారు. ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన లావణ్య త్రిపాఠి పరిస్థితి ఇదే.

రెండేళ్ల కిందటి వరకు లావణ్య కెరీర్ మంచి ఊపు మీదే కనిపించింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి విజయాలతో ఆమె కెరీర్లో మరో స్థాయికి వెళ్లేలా కనిపించింది. కానీ గత ఏడాదిన్నరలో వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. ఇప్పుడు లావణ్య ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఐతే అందం విషయంలో మాత్రం లావణ్య ఎవరికీ తక్కువ కాదు. ఇంకా ఆమె మంచి గ్లామర్ తోనే కనిపిస్తోంది. పైగా ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచింది. తాజా లావణ్య చేసిన ఫొటో షూట్ చూస్తే.. ఇంత చక్కటి అందాన్ని సరిగ్గా వాడుకుంటే సినిమాకు చాలా ప్లస్సవుతుంది కదా అనిపించకపోదు. మరి వరుణ్ సినిమా నుంచైనా లావణ్య రాత మారుతుందేమో.. మున్ముందు ఆమెకు మంచి అవకాశాలొచ్చి కెరీర్ మరి కొన్నేళ్లు కొనసాగుతుందేమో చూద్దాం.