Begin typing your search above and press return to search.

అందాల రాక్ష‌సి స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్

By:  Tupaki Desk   |   3 Feb 2021 2:30 AM GMT
అందాల రాక్ష‌సి స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్
X
ఎవ‌రికైనా క‌ష్టం సుఖం దుఃఖం త‌ప్ప‌నిస‌రి. మాన‌వ‌మాత్రుల‌కు ఇవ‌న్నీ స‌హ‌జం. అంత‌దానికే ఇదైపోతే ఎలా? ప్ర‌తిదానికి బ‌య‌ట‌ప‌డిపోతే ఎదుటివాడికి లోకువ‌. పాపం లావ‌ణ్య త్రిపాఠి కూడా ఇలానే ఇంత‌కుముందు ప‌లు సందర్భాల్లో లోకుల‌కు చిక్కి అలుసైంది. త‌న‌పై ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేశాయి. ఏదేమై‌నా ఇలాంటి డీప్ మ్యాట‌ర్స్ నుంచి చాలానే నేర్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అనుభ‌వాల నుంచి రాటుదేలి చాలా విష‌యాలు వ‌ల్లిస్తోంది. న‌న్ను నేను ప‌ట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌ను కానీ.. లోలోన చాలా ఉన్నాయ్! అని చెబుతూనే.. నేను ఇప్ప‌టికీ న‌న్ను ప‌ట్టించుకోను! అంటూ కొంటెగా చెప్పింది. లుక్ బ్యాక్ అండ్ థాంక్ గాడ్ అంటూ క‌ళ్యాణ్ య‌స‌శ్వి ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ ఎంతో క‌ళాత్మ‌కంగా ఆక‌ట్టుకుంది. పైగా లావ‌ణ్య ఒంపు సొంపుల్ని ఎంతో అందంగా ఎలివేట్ చేసింది ఈ షూట్. ఫ్లోర‌ల్ డిజైన‌ర్ ఫ్రాకు లావ‌ణ్య కోస‌మే డిజైన్ చేశారా? అన్నంత అందంగా సెట్ట‌య్యింది.

ఓవైపు కార్తికేయ స‌ర‌స‌న చావు క‌బురు చ‌ల్ల‌గా అనే చిత్రంలో న‌టిస్తూనే.. మ‌రోవైపు సందీప్ కిష‌న్ స‌ర‌స‌న ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో న‌టించింది లావ‌ణ్య‌. ఇవ‌న్నీ రిలీజ్ ల‌కు రెడీ అవుతున్న వేళ ప్ర‌చారం ప‌రంగా వేగం పెంచింది. త‌న సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకుంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు సాయ‌ప‌డుతోంది. త‌దుప‌రి లావ‌ణ్య వ‌రుస‌గా క‌థ‌లు వింటోంద‌ని తెలుస్తోంది.