Begin typing your search above and press return to search.

అందాల లావ‌ణ్యం న‌వ్వుకు ల‌వ్ లో ప‌డిపోతారు

By:  Tupaki Desk   |   30 April 2021 1:55 PM GMT
అందాల లావ‌ణ్యం న‌వ్వుకు ల‌వ్ లో ప‌డిపోతారు
X
అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల‌తో అభిమానుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చావుక‌బురు చ‌ల్ల‌గా- ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రాలు ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైనా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది.

అయితే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ త‌న మార్గంలో తాను ఉంది. ఇక ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం అదిరిపోయే ఫోటోల‌ను షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా లావ‌ణ్య త్రిపాఠి షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

హ్యాపీగా ఉండండి.. మీ న‌వ్వుకు ఎవ‌రైనా ప‌డిపోతారు! అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. తాజాగా సుందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం నుండి అమిగో వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను ఇన్నో జెంగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటకి హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్- వెంకటాద్రి టాకీస్ పతాకంపై తెర‌కెక్క‌గా.. డెన్నిస్ జీవన్ కనుకోలను దర్శకత్వం వహించారు.