Begin typing your search above and press return to search.

అద్దాల బాత్రూమ్ లో రాక్ష‌సి సెగ‌లు

By:  Tupaki Desk   |   19 Aug 2021 12:30 PM GMT
అద్దాల బాత్రూమ్ లో రాక్ష‌సి సెగ‌లు
X
స్టార్ హీరోయిన్ కావాల‌ని క‌ల‌లుగంటూ టాలీవుడ్ లో అడుగ‌పెట్టింది డెహ్రాడూన్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి. న‌టించిన తొలి సినిమాతోనే వంద‌శాతం మార్కులు కొట్టేసింది. అందాల రాక్ష‌సిగా యువ‌త‌రం గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇన్నేళ్ల కెరీర్ ఒడిదుడుకుల మ‌య‌యం. ఒక హిట్టు నాలుగు ఫ్లాపులు అన్నచందంగానే సాగింది. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుని చెల్లిలా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. కానీ ఆ ఒక్క‌టే చిక్క‌దు.

టాలీవుడ్ లో లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ చాలా కాలంగా సోసోగానే సాగుతోంది. ఏడాదికి ఒక‌టి రెండు మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ మెల్ల‌గా బండి లాగించేస్తోంది. ఈ ఏడాది `ఏ1 ఎక్స్ ప్రెస్`..`చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే రెండు చిత్రాల్లో న‌టించింది. కానీ ఆ సినిమాలేవి స‌క్సెస్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం చేతిలో అవ‌కాశాలు కూడా లేవు. ఆ క్ర‌మంలోనే ఇత‌ర మార్గాల్లో ఆదాయ ఆర్జ‌న‌పై ఆస‌క్తిగా ఉంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటూ ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ లావ‌ణ్యం బండి న‌డిపించేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి లావ‌ణ్య సినిమాలు ఈ త‌ర‌హాలోనే చేసుకుంటూ వ‌చ్చింది.

ఇప్ప‌టికీ అలాగే న‌త్త న‌డ‌క‌న సాగుతోంది. టాలీవుడ్ లో అమ్మ‌డికి ఉన్న ప‌రిచ‌యాలు.. ర్యాపో కార‌ణంగానే ఇంకా సినిమాలు చేయ‌గ‌లుగుతోంది. అగ్ర నాయిక‌ల పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డుతుంది. ఇక ప‌రభాష‌ల్లోనూ అంత‌గా శ్ర‌ద్ధ‌ పెట్ట‌లేదు. కోలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో ఓ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అటువైపు ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు. బొద్దందాల‌కే త‌మిళ తంబీలు ఓటేస్తార‌ని భావించిన లావ‌ణ్య అటువైపు చూడ‌క‌పోవ‌డానికి ఓ కార‌ణంగా చెప్పొచ్చు.

ఇక సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో నిరంత‌రం ట‌చ్ లో ఉంటుంది. గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ పైనే పూర్తిగా ఫోక‌స్ చేయ‌కుండా... ట్రెడిష‌న‌ల్ లుక్.. అల్ట్రా మోడ్ర‌న్ లుక్ తో మెరుపులు మెరిపిస్తుంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లూ స్పోర్ట్ ట్రాక్స్ లో క‌నిపించింది. స్కిన్ టైట్ డిజైనర్ లుక్ లో ఆక‌ట్టుకుంటోంది. టాప్ టు బాట‌మ్ ఒకే డిజైన్ తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ఇది బాత్రూమ్ ఫోటోషూట్. లావ‌ణ్య దిగిన ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.