Begin typing your search above and press return to search.

రాక్ష‌సి హాట్ పంచ్ కి నాకౌట్ త‌ప్ప‌దు!

By:  Tupaki Desk   |   7 Jun 2022 4:30 PM GMT
రాక్ష‌సి హాట్ పంచ్ కి నాకౌట్ త‌ప్ప‌దు!
X
లావ‌ణ్య త్రిపాఠి అలియాస్ అందాల రాక్ష‌సి గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్ గా వెల‌గ‌లేదు గానీ.. టాలీవుడ్ కి వెల్ నోన్ బ్యూటీ. కొన్ని సంప్ర‌దాయాల‌తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు చాలా సినిమాల్లో న‌టించింది. కానీ స్టార్ హీరోయిన్ల జాబితాలో మాత్రం ఇంకా స్థానం సంపాదించ‌లేదు. న‌టిగా ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. ఏరోజైనా అగ్ర నాయిక‌ల స‌ర‌స‌న చేర‌క పోతోనా? నాకంటూ ఓ పేజీ లిఖించ‌కుండా ఉంటానా? అన్న న‌మ్మ‌కంతో ప్ర‌య‌త్న లోపం లేకుండా శ్ర‌మిస్తుంది.

అందుకు నిజంగా బ్యూటీని మెచ్చుకోవాల్సిందే. ఆ సంక‌ల్పంతోనే ఇంకా అవకాశాలు అందుకోగ‌ల్గుతుంది. కెరీర్ ప్రారంభ‌మై ద‌శాబ్ధం దాటింది. ఈ ప్ర‌యాణంలో చాలా మంది హీరోయిన్లు వ‌చ్చారు..వెళ్లారు. కానీ లావ‌ణ్య‌కి మాత్రం న‌వ నాయిక‌లు ఎవ‌రూ పోటీ కాదు. త‌న‌కు తానే పోటీ. సీనియ‌ర్ల‌తో పోటీకి దిగదు. అందివ‌చ్చిన అవకాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది.

సాధార‌ణంగా డౌన్ పాలో లో ఉన్నఏ హీరోయిన్ కెరీర్ ఇంత ప్ర‌శాంతంగా సాగ‌దు. ఆ విష‌యంలో లావ‌ణ్య ల‌క్కీ గాళ్ అనే తెలుస్తుంది. న‌టిగా కొన్ని ప‌రిమితుల‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికీ వాటిని పాటిస్తుంది. అవ‌స‌రం మేర అప్పుడ‌ప్పుడు స‌డ‌లింపులు ఇస్తోంది. ఇటీవ‌లి కాలంలోనే ఆ ప‌ద్ద‌తి లో హైలైట్ అవుతోంది. తాజాగా అమ్మ‌డి కొత్త ఫోటోలో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది.

మిరుమిట్లు గొలిపే అద్దాల దుస్తుల్లో యువ‌త‌ని నాకౌట్ చేస్తుంది. స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో లావ‌ణ్య దుమారం మామూలుగా లేదిక్క‌డ‌. షైనింగ్ ఔట్ ఫిట్ కి మ్యాచింగ్ స్లీప‌ర్స్ అంతే హైలైట్ అవుతున్నాయి. భుజానికి బ్లూ క‌ల‌ర్ హ్యాండ్ బ్యాగ్ త‌గిలించుకుని మ‌క్క‌ల‌పై చేతులేసి అలా క్యామ్ వైపు చూస్తూ బ్యూటీ వయ్యారంగా ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. లావ‌ణ్య పై అభిమానుల కామెంట్లు అంతే హీటెక్కిస్తున్నాయి. సాధార‌ణంగా ఇలాంటి మెరుపుల‌కు లావ‌ణ్య దూరంగా ఉంటుంది. కానీ రేసులో నిల‌దొక్కుకోవాలంటే త‌ప్ప‌వు మ‌రి. అందుకే సొగ‌స‌రి ఇలా మిరుమిట్లు గొలుపుతుంది.

ఇక లావ‌ణ్య సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `హ్యాపీ బ‌ర్త్ డే` అనే సినిమాలో న‌టిస్తోంది. కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌లో ద‌శ‌లో ఉన్నాయి. చివ‌రిగా గ‌తేడాది `ఎ1 ఎక్స్ ప్రెస్`..`చావు క‌బురు చ‌ల్ల‌గా` చిత్రాల్లో న‌టించింది. ఆ రెండు కూడా అంచ‌నాలు అందుకోలేదు. అంత‌కు ముందు `అర్జున్ సుర‌వ‌రం`తో స‌క్సెస్ అందుకుని ఫాంలోకి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చింది. కానీ రెండు ప‌రాజ‌యా ల‌తో ఆ ఫాంని కోల్పోయింది. `హ్యాపీ బ‌ర్త్ డే`తో మ‌ళ్లీ లైన్ లోకి రావాల‌ని వెయిట్ చేస్తోంది.