Begin typing your search above and press return to search.

అందాలరాక్షసి పాకెట్ డాన్స్ స్పెషల్ ట్రీట్.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   29 April 2021 3:49 PM GMT
అందాలరాక్షసి పాకెట్ డాన్స్ స్పెషల్ ట్రీట్.. వీడియో వైరల్!
X
టాలీవుడ్ అందాలరాక్షసి లావణ్య త్రిపాఠీ.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అనే సంగతి తెలిసిందే. ఓవైపు సినిమా విషయాలు షేర్ చేస్తూనే మరోవైపు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా సమయం కాబట్టి సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ ఫాలోయర్లకు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు అందిస్తుంది. అలాగే రోజువారీ ప్రత్యేకతలను కూడా గుర్తుచేస్తుంది. తాజాగా ఈ వయ్యారి ట్విట్టర్ వేదికగా 'వరల్డ్ డాన్స్ డే' సందర్బంగా ఓ డాన్స్ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో సాంగ్ తో పాటు లావణ్య డాన్స్ కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే అటు సాంగ్ లిరిక్స్ అర్ధం కావు.. ఇటు లావణ్య డాన్స్ అర్ధం కావడం లేదు.

కానీ అందాలరాక్షసి కదా.. చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు అభిమానులు. ఈ ఢిల్లీ వయ్యారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంటర్నేషనల్ డాన్స్ డే అంటూ అమ్మడు రెడ్ టాప్ బ్లాక్ బెలూన్ ప్యాంటు ధరించి పాకెట్ డాన్స్ చేసినట్లుగా అయితే అర్ధమవుతుంది. అలాగే లావణ్య సాంగ్ కు తగ్గట్టుగా మేకప్ తో అందంగా ముస్తాబు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఏ1ఎక్సప్రెస్, చావుకబురు చల్లగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది లావణ్య. కానీ ఈ రెండు సినిమాలు కూడా లావణ్యకు హిట్టు అందించలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఎలాంటి సినిమాలు లేవని సమాచారం. చూడాలి మరి ఈ కరోనా పరిస్థితి నుండి కోలుకుంటే మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో!