Begin typing your search above and press return to search.

వీడియో : తన లోపంను చెప్పిన అందాల రాక్షసి

By:  Tupaki Desk   |   12 Aug 2021 1:30 PM GMT
వీడియో : తన లోపంను చెప్పిన అందాల రాక్షసి
X
తన మొదటి సినిమా అందాల రాక్షసి కి అచ్చు గుద్దినట్లుగా సరిపోయే ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి అనడంలో ఈమెను ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే తన అందంతో కుర్ర కారును రాక్షసి మాదిరిగా వేదిస్తూ ఉంటుంది. అందుకే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అంటూ ఆమె ఫిక్స్‌ అయ్యింది. హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే ఈ అమ్మడు చిన్న బ్రేక్‌ తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తనకు ఉన్న ఒక సమస్య కారణంగా బ్రేక్ తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పింది.

లావణ్య త్రిపాఠి అత్యంత విభిన్నమైన మానసిక సమస్యతో బాధ పడుతుందట. ఆ విషయాన్ని తెలియజేసేందుకు గాను లావణ్య త్రిపాఠి ఇలా ముందుకు వచ్చింది. లావణ్య కు కొన్ని ఆకారాలు చూడగానే విపరీతమైన భయం కలుగుతుందట. ఆ ఆకారాలు ఏంటీ అనే విషయం గురించి కూడా ఆలోచించకుండా ఆందోళన చెందుతూ ఉంటుందట. ఆమె ఆ సమయంలో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి కూడా గురి అవుతుందట. అందుకే ఆమె కొంత గ్యాప్ తీసుకుని ఆ సమస్య నుండి బయట పడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మానసికంగా సరిగా ఉన్నప్పుడు మాత్రమే జీవన శైలి సక్రమంగా సాగుతుంది. తనకు ఉన్న ఈ ఫోబియాను ట్రిపోఫోబియా అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా నేను ఫెయిల్‌ అవుతూనే ఉన్నాను అంది. త్వరలోనే ఈ సమస్యను జయించి మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ నమ్మకంగా చెప్పింది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మొదలు పలు కమర్షియల్ సక్సెస్‌ లను దక్కించుకున్న లావణ్య త్రిపాఠి మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని.. ఆమె సమస్య తొలగిపోవాలని కోరుకుందాం.