Begin typing your search above and press return to search.

వెజ్ హీరోయిన్.. నాన్ వెజ్ ఆర్డరిస్తోంది

By:  Tupaki Desk   |   15 Feb 2017 6:04 AM GMT
వెజ్ హీరోయిన్.. నాన్ వెజ్ ఆర్డరిస్తోంది
X

అయోధ్యలో పుట్టి ఉత్తరాఖండ్ లో పెరిగి.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా వరుస సినిమాలో అమ్మడు కుమ్మేస్తోంది.

ఇక కుమ్మేయడం విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి.. చికెన్ బిర్యాని తెగ ఇష్టంగా తినేస్తోంది. కానీ ఈమె పక్కా వెజిటేరియన్. 'అవును నేను వెజిటేరియన్ నే. అయినా.. చికెన్ బిర్యానీనే ఆర్డర్ చేస్తాను. ఆ తర్వాత బిర్యానీలోంచి చికెన్ పీస్ లన్నీ తీసి సెపరేట్ గా పెట్టేసి.. విడిగా బిర్యాని మాత్రం తింటాను. రెగ్యులర్ వెజిటబుల్ బిర్యానీ కంటే.. ఈ బిర్యానీ టేస్ట్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది' అంటున్న లావణ్య త్రిపాఠికి.. సౌత్ ఇండియా ఫుడ్స్ అన్నీ ఇష్టమేనట. ఇడ్లీ.. దోశ సహా అన్ని తెగ ఇష్టంగా తింటానని చెబుతోంది.

ప్రస్తుతం ఈ భామ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించిన మిస్టర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. శర్వానంద్ తో ఓ సినిమాని మొదలుపెట్టి చకచకా తన పార్ట్ ని పూర్తి చేసేస్తోంది. నాగచైతన్యతో సినిమా చేసేందుకు సైన్ చేసింది లావణ్య త్రిపాఠి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/