Begin typing your search above and press return to search.
పాపం లావణ్య.. ఇది రెండో షాక్..
By: Tupaki Desk | 20 Aug 2018 7:05 AM GMTకాలం కలిసి వస్తే అదృష్టం మారిపోతుందంటారు. ఈ విషయంలో లావణ్య అనవసరంగా అవకాశాలు చేజార్చుకోగా.. ఈమె చేసిన పొరపాట్లు ఇతర హీరోయిన్లకు స్టార్ డంను తెచ్చిపెట్టాయి. హీరోలకే కాదు.. హీరోయిన్లు కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్ కు ఎంత పెద్ద నష్టమో తాజా సంఘటనతో హీరోయిన్ లావణ్య తిప్రాఠికి బాగా తెలుసొచ్చింది.
ప్రస్తుతం రిలీజ్ అయ్యి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది గీతా గోవిందం మూవీ.. ఈ మూవీలో తొలుత దర్శకుడు పరుశురాం హీరోయిన్ గా లావణ్య త్రిపాఠినే తీసుకున్నాడట.. ఆమెతో ఫొటో షూట్ కూడా నిర్వహించాడు. కానీ ఆఖరి నిమిషంలో లావణ్య తప్పుకుంది. ఓ తమిళ సినిమా ఒప్పుకున్న కారణంగా గీతాగోవిందం మూవీని వదులుకుంది. ఆమె చేసిన పెద్ద తప్పు ఇదే. ఇప్పుడు గీతాగోవిందం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. హీరోయిన్ రష్మిక కు మంచి పేరు వచ్చి వరుస అవకాశాలు వెల్లువలా వస్తుండడంతో లావణ్య తలపట్టుకుంటుదట..
లావణ్య చేసిన పొరపాటు ఇదొక్కటే కాదు.. గతంలో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ మూవీలో కూడా ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారట.. ఆ సినిమా కూడా వదులుకొని పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ‘గీతగోవిందం’తో మరో భారీ హిట్ ను మిస్ చేసుకుంది. ఇలా వరుసగా రెండు హిట్స్ ను మిస్ చేసుకొన్న లావణ్యను దురదృష్టం బాగానే వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.