Begin typing your search above and press return to search.

అందాల రాక్షసి హ్యాట్రిక్... ఇక కష్టమేనా?

By:  Tupaki Desk   |   11 July 2022 5:36 AM GMT
అందాల రాక్షసి హ్యాట్రిక్... ఇక కష్టమేనా?
X
గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి బ్యాక్ టు బ్యాక్‌ ప్లాప్‌ లనే చవిచూసింది. ఏ1 ఎక్స్‌ ప్రెస్ మరియు చావు కబురు చల్లగా సినిమాలు లావణ్య త్రిపాఠి కి నిరాశ పర్చగా ఈ ఏడాది హ్యాపీ బర్త్‌ డే సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్‌ ల్లో హ్యాట్రిక్ ను నమోదు చేసింది.

దశాబ్ద కాలం క్రితం అందాల రాక్షసి సినిమా తో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి కెరీర్ లో ఎక్కువ శాతం ప్లాప్ లతోనే చవిచూసింది. అయినా కూడా అదృష్టం కొద్ది ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ దక్కక పోతుందా... కమర్షియల్‌ గా సక్సెస్‌ ఫుల్‌ స్టార్‌ హీరోయిన్ గా మారక పోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కెరీర్‌ చరమాంకంలోకి చేరిందా అంటే ఔను అనే సమాధానం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఒక వెబ్‌ సిరీస్ లో ఈమె నటిస్తుంది. ఆ వెబ్‌ సిరీస్ సక్సెస్ అయ్యి మళ్లీ హీరోయిన్ గా సినిమాల్లో నటించే అవకాశం వస్తుందనే విశ్వసంతో ఈ అందాల రాక్షసి కనిపిస్తుంది.

హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి భారీ కమర్షియల్‌ సక్సెస్ లు లేకున్నా కూడా ఇన్నాళ్ల పాటు కెరీర్‌ ను కంటిన్యూ చేయగలిగింది అంటే చాలా పెద్ద విషయం.

ఆమె కు సంబంధించినంత వరకు ఇండస్ట్రీ లో మంచి స్నేహాలు ఉన్నాయి. ఆ స్నేహాలతో కెరీర్‌ ను మరికొంత కాలం వరకు కంటిన్యూ చేయగలిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందంతో పాటు అభినయం విషయంలో అందరిని అబ్బుర పరిచే ముద్దుగుమ్మ అందాల రాక్షసి. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ ఫోటో షూట్స్ మళ్లీ ఆఫర్లు తెచ్చి పెడతాయనే అభిప్రాయం ను కూడా కొందరు ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.