Begin typing your search above and press return to search.

లేడీ అమితాబ్ ప్లేస్ లో.. ప్చ్

By:  Tupaki Desk   |   7 Feb 2018 2:30 AM GMT
లేడీ అమితాబ్ ప్లేస్ లో.. ప్చ్
X
సాయి ధరం తేజ్ మూవీ ఇంటెలిజెంట్ లో చిరంజీవి ఎవర్ గ్రీన్ సాంగ్ ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ రీమిక్స్ ట్రెండ్ కు బ్రేక్ వేసినా.. మళ్లీ రీస్టార్ట్ చేసిన తేజు.. ఈసారి కొండవీటి దొంగ చిత్రం నుంచి చమక్ చమక్ చాం పాటను పట్టుకొచ్చాడు. ఒరిజినల్ ను పెద్దగా మార్పులు చేయకుండా.. తమన్ ఈ పాటను కంపోజ్ చేసిన తీరులో ప్రయోగాలు ఏమీ లేవు.

ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పుడీ పాటకు సంబంధించిన వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. అందమైన లొకేషన్స్ లో పాట చిత్రీకరించిన తీరు బాగానే ఉంది. మెగా స్టార్ డ్రెస్సులనే మళ్లీ చూపించేస్తూ.. తేజు బాగానే ఆకట్టుకున్నాడు. ఇమిటేషన్ చేస్తున్నాడు లాంటి వాటినేమీ పట్టించుకోకుండా.. మెగాస్టార్ ను దింపేశాడు. కాబట్టి మెగా ఫ్యాన్స్ కు సమస్యేమీ లేదు. కానీ హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికే అసలు ప్రాబ్లెమ్ అంతా వస్తోంది. లేడీ అమితాబ్ అంటూ అభిమానులతో పిలిపించుకున్న విజయశాంతి ప్లేస్ లో.. అందాల రాక్షసి అయిన లావణ్య త్రిపాఠిని చూడ్డం కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా పరిణమించింది.

లావణ్య అందాలకు లోటేమీ లేదు. కానీ డ్యాన్స్ విషయంలో కానీ.. గ్రేస్ లో కానీ విజయశాంతిని 1 పర్సెంట్ కూడా మ్యాచ్ చేయలేకపోయిందనే సంగతి ప్రోమోలోనే అర్ధమైపోతోంది. మెగాస్టార్ తో సమానంగా డ్యాన్సులు చేయడంలో విజయశాంతికి బోలెడంత పేరు ఉంది. కానీ లావణ్యలో ఆ ట్యాలెంట్ తక్కువే. అందాల ఎగ్జిబిషన్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది కానీ.. ఏ మేరకు సక్సెస్ అయిందో థియేటర్లోనే చూడాలి.