Begin typing your search above and press return to search.
సాయికి సిగ్గెక్కువ.. అప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం
By: Tupaki Desk | 6 Feb 2018 6:30 PM GMTఅందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం కొంచెం ఫెయిల్యూర్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందుకు ఏమైనా బాధగా ఉందా అంటే.. ఆబ్బె అలాంటిది ఏమి లేదండి. కాకపోతే కొంచెం అలోచించి ఏం తప్పు చేశాను అనే విషయంలో జాగ్రత్త పడతాను. సక్సెస్ లు వచ్చినప్పుడు కూడా నేనేమి మరి ఎక్కువ ఎగరను. భూమ్మీదే ఉంటానని చెప్పింది ఇంటలిజెంట్ సుందరి.
ప్రస్తుతం సొట్ట బుగ్గల సుందరి తన ఆశలన్నిటిని వినాయక్ దర్శకత్వంలో చేసిన ఇంటిలిజెంట్ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా బావుంటుందని అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుందని లావణ్య రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. ఇంకా ఏం చెప్పిందంటే.. సినిమాలో కథ పరంగా కొనసాగే పాత్ర నాది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. హీరో విలన్ ల మధ్య ఇంటలిజెంట్ సన్నివేశాలు హైలెట్. హీరో తన మెదడుతో విలన్ ని దెబ్బ కొడతాడు. నా పాత్ర పేరు ఇందులో సంధ్య. యూఎస్ రిటర్న్. కొంచెం కోపంగా ఫన్నీగా ఉంటాను.
వినాయక్ గారితో చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయన మార్క్ హీరోయిన్ లా ఈ సినిమాలో కనిపిస్తా. అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి కూడా హీరోయిన్స్ కి అనుకూలంగా ఉండేలా చూసుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. ప్రతి సీన్ చాలా గమ్మత్తుగా తెరకెక్కించారు. ఇక సాయితో ఇంతకుముందు ఎక్కువగా పరిచయం లేదు. షూటింగ్ స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకోలేదు. అతనికి కొంచెం సిగ్గెక్కువ. కానీ మస్కట్ షూటింగ్ లో ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అయ్యిందని అనుకుంటున్నా అని తెలిపింది.
ఇక చమకు చమకు సాంగ్ గురించి మాట్లాడుతూ..మొదట అది మెగాస్టార్ సాంగ్ అని నాకు తెలియదు. షూటింగ్ స్పాట్ కి వెళ్లాకా నాకు తెలిసింది. అయితే సాధారణంగా నేను మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. గొప్ప వాళ్లు చేసిన సాంగ్ కాబట్టి నేను ఆ స్థాయిలో చేయాలని అనుకోలేదు. కేవలం మెగా స్టార్ అభిమానిగా ఆనందంగా చిందులు వేశానని అందాల రాక్షసి వివరించింది.