Begin typing your search above and press return to search.
నాకు అన్నీ సినిమాలే అంటున్న లచ్చిందేవి
By: Tupaki Desk | 23 Jan 2016 1:30 AM GMTవరుసగా రెండు హిట్స్ కొట్టి జోష్ మీద ఉంది లావణ్య త్రిపాఠి. భలేభలే మగాడివోయ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని, ఇప్పుడు సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనతో హిట్ కొట్టింది ఈ అందాల రాక్షసి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉన్న ఈ మిస్ ఉత్తరాఖండ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే వారం విడుదల కానున్న లచ్చిందేవికి ఓ లెక్కుంది మూవీకి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేసింది లావణ్య.
- లచ్చిందేవి సినిమా గురించి చెప్పండి?
ఈ మూవీలో నేను అంకాలమ్మ, ఉమాదేవి, దేవి పాత్రల్లో నటిస్తున్నాను. ముఖ్యంగా అంకాలమ్మ పాత్ర కోసం, ఒళ్లంతా నగలు ధరించి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.
- ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే చేస్తారా ?
ఇప్పటివరకూ నేను చేసినవన్నీ సంప్రదాయ పాత్రలే కావడంతో, అన్నీ అలాంటి ఆఫర్సే వస్తున్నాయి. ఇకపై మోడర్న్ అమ్మాయి పాత్రలకోసం చూస్తున్నాను. సెలక్షన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాను.
- గృహిణి రోల్ లో చేశారు, ఏం భయం వేయలేదా?
సోగ్గాడు చిత్రంలో నేను పెళ్లైన అమ్మాయి రోల్ లో చేయడానికి ఒప్పుకున్నపుడు అందరూ హెచ్చరించారు. ఇకపై అలాంటివే చేయాల్సి వస్తుందని చెప్పారు. కానీ హౌజ్ వైఫ్ రోల్ ని మనంలో సమంత చేసిందనే విషయం గుర్తొచ్చి, కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను.
- సినిమాల గురించి మీ ఫ్యామిలీ ఒపీనియన్!
సినిమాల్లో చేసేందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ కు ఏమాత్రం అభ్యంతరం లేదు. అయితే డిగ్రీ మాత్రం కంప్లీట్ చేయాలని చెప్పారు.
- సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారు?
నా వరకు నాకు సినిమాలే లైఫ్. ఇంకెలాంటి ప్లాన్స్ లేవు. ప్లాన్ బీ లాంటివేవీ ఆలోచించలేదు.
- రాబోయే ప్రాజెక్టుల సంగతేంటి?
త్వరలో అల్లు శిరీష్ తో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తీయబోతున్న ఓ మూవీలో కనిపించనుంది లావణ్య త్రిపాఠి.