Begin typing your search above and press return to search.
ఈ అవకాశాలు తగ్గాయి..ఆ యాడ్స్ పెరిగాయ్
By: Tupaki Desk | 4 May 2018 6:59 AM GMTఅందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి చూస్తుండగానే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. మొదట్లో క్ కెరీర్ స్పీడ్ గానే కొనసాగినా ఆ తరువాత పెద్దగా విజయాలు అందుకోలేదు. సోగ్గాడే చిన్ని నాయన - బలే బలే మగాడివోయ్ సినిమాలు తప్పితే పెద్ద హిట్ ఇంత వరకు అందుకోలేదు. గత ఏడాది అయితే అమ్మడికి డిజాస్టర్స్ ఎక్కువ అందాయి.
ఇక వివి.వినాయక్ లాంటి స్టార్ దర్శకుడి చేతిలో పడినా హిట్ అందుకోలేదు. ఇంటిలిజెంట్ సినిమా ఏ స్థాయిలో ప్లాప్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా అందకపోవడంతో అమ్మడు యాడ్స్ తో కాలాన్ని గడుపుతోంది. రీసెంట్ గా ప్రముఖ శారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని అవసరమైనప్పుడు ఫొటో షూట్స్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
వరుణ్ తేజ్ స్పెస్ థ్రిల్లర్ సినిమాలో లావణ్య మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైంది. అదితిరావ్ హైదరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. వరుసగా అపజయాల్లో ఉన్న లావణ్య కు ఈ అఫర్ దక్కడం నిజంగా అదృష్టమే అని చెప్పాలి. మరి ఆ సినిమాతో అయినా అమ్మడి తలరాత మారుతుందో లేదో చూడాలి.