Begin typing your search above and press return to search.

స్పోర్స్ట్ దుస్తుల్లో రాక్ష‌సి...రూప లావ‌ణ్యంలో మార్పులేలా!

By:  Tupaki Desk   |   15 Nov 2022 11:30 AM GMT
స్పోర్స్ట్ దుస్తుల్లో రాక్ష‌సి...రూప లావ‌ణ్యంలో మార్పులేలా!
X
బాలీవుడ్ లో స్పోర్ట్ లుక్ తో బోల్డ్ బ్యూటీస్ గా పాపులరయ్యారు మలైకా అరోరాఖాన్.. దిశా పటానీ. ఆ ఇద్దరి బాటలోనే నేటితరం నటవారసురాళ్లు జాన్వీ.. అనన్య.. సారా అలీఖాన్ లాంటి భామలు వేడెక్కించే స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపిస్తున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో మంటలు పుట్టించాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీల‌కే చెమటలు పట్టేలా.. ఫ్యాషనిస్టుల‌కే గుబులు పుట్టేలా చేస్తోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.

తాజాగా స్పోర్ట్స్ దుస్తుల్లో లావణ్య ఇచ్చిన ఫోజులు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. లావణ్య నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇదన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిగో ఇక్క‌డిలా జిమ్ సెష‌న్ అనంత‌రం బ్యూటీ ఇలా కెమెరాకి చిక్కింది.నీలి రంగు స్పోర్ట్స్ ప్యాంట్ మ్యాచింగ్ టైట్ ఫిట్ బ్లౌజులో హాయ్ చెబుతూ కుర్రాళ్ల మ‌తులు పొగొడుతుంది.

భుజాన హ్యాండ్ బ్యాగ్..చేతిలో స్మార్ట్ ఫోన్.. న‌ల్ల‌టి మాస్క్ తో ఎగ్జిట్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ ఫోటో లావ‌ణ్య కాస్త చబ్బీగానే క‌నిపిస్తుంది. హిప్ సైజ్ ఇంక్రీజ్ అయిన‌ట్లు ఎలివేట్ అవుతుంది. ముఖం కాస్త ఉబ్బెత్తుగానూ క‌నిపిస్తుంది.మ‌రి అది నిద్ర‌లేమి త‌న‌మా? లేక ముఖం చుట్టూ కొలెస్ర్టాల్ పేరుకుపోయిందా? అన్న‌ది క్లారిటీ రావాలి.

మొత్తంగా స‌న్న‌జాజి సోయగంలో క‌నిపించే లావ‌ణ్యం శ‌రీరంలో కొన్ని ర‌కాల మార్పులైతే చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు సైతం లావ‌ణ్య అందాన్ని చూసి డేని మొద‌లు పెడుతున్నారు.

ఇక లావ‌ణ్య కెరీర్ సంగ‌తి చూస్తే ఇంకా డ‌ల్ గానే సాగుతోంది. అమ్మ‌డు చివ‌రిగా 'హ్యాపీ బ‌ర్త్డ్ డే' అనే లేడీ ఓరియేంటెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది గానీ ఫ‌లించ‌లేదు. ఆ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది. కానీ అంచ‌నాలు తారు మార‌య్యాయి. ప్ర‌స్తుతం అవ‌కాశాల వేట‌లో ఉంది. మ‌రి హీరోయిన్ గా వ‌స్తుందా? లేక‌ మ‌రో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో ఛాన్స్ అందుకుంటుందా? అన్న‌ది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.