Begin typing your search above and press return to search.

లావణ్య త్రిపాఠి.. గ్లామర్ డోస్ ఎంత పెంచినా..

By:  Tupaki Desk   |   3 Jan 2023 4:34 AM GMT
లావణ్య త్రిపాఠి.. గ్లామర్ డోస్ ఎంత పెంచినా..
X
అందాల రాక్షసి సినిమాలో చాలా క్యూట్ గా కనిపించిన లావణ్య త్రిపాఠి ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఎంతగానో ఆకర్షించింది. ఇక ఈ బ్యూటీ తన డింపుల్ లుక్స్ తో కూడా ఓ వర్గం కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇండస్ట్రీలో కళ్ళు మూసి తెరిచేలోపే ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక మీడియం రేంజ్ హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్ని సినిమాలతో అయితే మంచి బాక్సాఫీస్ హిట్స్ ను సొంతం చేసుకుంది.

ముఖ్యంగా నాని భలే భలే మగాడివోయ్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలు కెరీర్ కు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చాయి. అయితే ఆ సినిమాల తర్వాత ఈ బేబీని చాలా దురదృష్టం వెంటాడుతోంది.

ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన అర్జున్ సురవరం సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి.

ముఖ్యంగా ఇటీవల హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో మేజర్ రోల్ చేసింది కానీ ఆ సరియల్ కామెడీ అసలు ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఈ డ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇటీవల లావణ్య త్రిపాఠి చిన్న నిక్కర్లో లెగ్స్ అందాలను ఏదో జాలి లాంటి డ్రెస్ తో కప్పేసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ప్రత్యేకంగా ఒక రీల్ కూడా విడుదల చేసింది.

అందులో అమ్మడు కత్తిలాంటి చూపుతో తన లెగ్స్ అందాలను చాలా అందంగా ప్రజెంట్ చేసింది. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదు అని ఈ బ్యూటీ ఒక విధంగా చెప్పకనే చెబుతోంది. కానీ సరైన కంటెంట్ ఉన్న స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఈ బ్యూటీ కి రావడం లేదు. మరి ఈ తరహా గ్లామర్ షో ద్వారా ఎవరైనా చాన్సులు ఇస్తారో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.