Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న ఏ1 ఎక్సప్రెస్ బ్యూటీ పిక్..!!
By: Tupaki Desk | 27 July 2020 1:30 PM GMTడెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠీకి తెలుగులో మంచి హిట్లే పడ్డాయి. ఆమె నాగార్జునతో చేసిన సోగ్గాడే చిన్న నాయన, నానితో భలే భలే మగాడివోయ్ మూవీలు పెద్ద హిట్. ఆ తరువాత ఆమె చేసిన చాలా సినిమాలు బాగానే ఉందనిపించాయి. ఇక చివరిగా నిఖిల్ తో చేసిన మూవీ అర్జున్ సురవరం కూడా హిట్ అనిపించుకుంది. అయితే లావణ్య కంప్లీట్ ట్రెడిషనల్ మూవీలకే పనికివస్తుందని ఒక టాక్ స్ప్రెడ్ అయింది. అదీగాక లావణ్య సీనియర్ హీరోల పక్కన నటించిన కారణంగా యంగ్ హీరోలు సైడ్ చేసేశారు. దాంతో అందాల ఆరబోయడానికి అన్ని ఉన్నా అమ్మడికి అవకాశాలు మాత్రం లేకుండా పోయాయి అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం లావణ్య యువ కథానాయకులతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు ఇటీవలే తమిళంలో 'వాల్మీకి' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో హీరోయిన్‌గా ఫైనలయింది. ఇటీవల అవసరమైతే బికినీ అందాలను ఆరబోయడానికి తాను సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమ్మడి అందాలన్నీ సినిమాలలో ఆరబొద్దాం అనే టైంలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న లావణ్య.. వర్కౌట్లతో బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ బాగానే ఉంది. తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా మోడల్ శిల్పారెడ్డి నామినెట్ చేసిన 'విమెన్ సపోర్ట్ విమెన్' అనే హ్యాష్ ట్యాగ్ జోడించి ఛాలెంజ్ స్వీకరిస్తూ ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు.. థాంక్యూ శిల్ప! నన్ను నామినేట్ చేసినందుకు నేను కూడా వేరే వాళ్ళకి ఛాలెంజ్ రెఫెర్ చేస్తాను అంటూ కాప్షన్ జోడించింది. బ్లాక్ అండ్ వైట్ లో పోస్ట్ చేసిన లావణ్య పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.