Begin typing your search above and press return to search.

'భద్రత తప్పనిసరి రిస్క్ వద్దు' అంటున్న యంగ్ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   22 July 2020 12:30 PM GMT
భద్రత తప్పనిసరి రిస్క్ వద్దు అంటున్న యంగ్ హీరోయిన్!!
X
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి వేల కేసులు నమోదు అవుతుండగా ప్రజలలో మరింత భయం మొదలవుతుంది. ఇప్పటికే ఎన్ని జాగ్రత్తలు పడినా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఎవరినీ వారు కాపాడుకోవడమే సవాల్ అయింది. అయితే ఎటైనా ప్రయాణం చేయాలంటే మాత్రం తప్పకుండా తగిన జాగ్రత్తలు అవసరం అని నిరూపిస్తుంది హీరోయిన్ లావణ్య. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో తను ప్రయాణించడానికి సిద్దమవుతుంది. ఆమె ఎలా రెడీ అయిందో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. లావణ్య ధరించిన సేఫ్టీ సూట్ చూస్తే ఆమెను అభినందించకుండా ఉండలేరు. ఓసారి చూడొచ్చు లావణ్య ఎలా సూట్ ధరించి రెడీ అయిందో.. అలా కొత్త సూట్ ధరించి మెత్తని పరుపు పై దూకుతూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

లావణ్య ధరించిన డ్రెస్ చూస్తేనే అర్ధమవుతుంది ఆమె ప్రయాణానికి సిద్ధం అయిందని. స్పష్టంగా విసువల్ లో కూడా గమనించవచ్చు. బహుశా ఈ సేఫ్టీ సూట్ తప్పనిసరి అని గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె గాగుల్స్.. సూట్ తో పర్ఫెక్ట్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. భద్రత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు కూడా రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేయరు. అలా చేస్తే కొత్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచం ఇప్పటికే చాలా మారిపోయింది. లాక్ డౌన్ తర్వాత కూడా మరిన్ని మార్పులు చోటుచేసుకోవడం చూడబోతున్నాం. ప్రస్తుతం లావణ్య ధరించిన సేఫ్టీ సూట్ డ్రెస్ బాగానే అనిపించినప్పటికి రోజువారీ దుస్తులలా సౌకర్యంగా మాత్రం అనిపించదు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం లావణ్య కోవిద్ సేఫ్టీ సూట్ నెట్టింట వైరల్ అవుతోంది.