Begin typing your search above and press return to search.
చరణ్ పేరు మరిచినందుకు సారీ చెప్పింది
By: Tupaki Desk | 20 Dec 2018 2:09 PM GMTసోషల్ మీడియా బాగా యాక్టివ్ అయ్యాక సినిమా వాళ్లకు లేని పోని తలనొప్పులు మొదలయ్యాయి. మామూలుగా సినిమా వాళ్లకుండే గ్లామర్ వల్ల వారిపై విపరీతమైన ఫోకస్ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. వాళ్లు తుమ్మినా దగ్గినా వార్త అయిపోతోంది. ఏ చిన్న పొరబాటు జరిగినా దాన్ని చాలా పెద్దది చేసేసి వివాదంగా మార్చేస్తున్నారు. ఆ మధ్య ఆదర్శ్ బాలకృష్ణ అనే నటుడు ఎన్టీఆర్ పేరు పక్కగ గౌరవ సూచకం పెట్టలేదని అభిమానులు గొడవ చేశారు. ఇలాంటి ఉదంతాలు మరెన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇక సినిమాల ఆడియో.. ప్రి రిలీజ్ ఈవెంట్లకు హాజరయ్యే నటీనటులు మాట్లాడేటపుడు ఏ చిన్న పొరబాటు దొర్లినా సోషల్ మీడియా జనాలకు టార్గెట్ అయిపోతున్నారు.
తాజాగా లావణ్య త్రిపాఠికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే జరిగిన ‘అంతరిక్షం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో లావణ్య మాట్లాడేటపుడు అందరి గురించి మాట్లాడి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ పేరు మరిచిపోయింది. ఇక అంతే.. మెగా ఫ్యాన్స్ అలెర్టయిపోయారు. చరణ్ పేరు మరిచిపోతావా అంటూ ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం లావణ్య వరకు వచ్చింది. దీంతో ఆమె ఆలస్యం చేయకుండా సారీ చెబుతూ ఒక ట్వీట్ పెట్టింది. ఆ వేడుకలో తాను కొంచెం నెర్వస్ గా ఉన్నానని.. ఆ క్రమంలోనే చరణ్ పేరు మరిచిపోయానని.. ఇందుకు సారీ అని.. ఈ కార్యక్రమానికి వచ్చి తమకు సపోర్ట్ చేసిన చరణ్ కు ధన్యవాదాలని ట్వీట్లో పేర్కొంది లావణ్య. దీంతో మెగా అభిమానులు శాంతించారు. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలకు కూడా సెలబ్రెటీల్ని టార్గెట్ చేసి వాళ్లను బజారుకీడ్చాలని చూడటం కచ్చితంగా తప్పే. అభిమానులు ఇలాంటి విషయాల్లో కొంచెం సంయమనం పాటించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.