Begin typing your search above and press return to search.
మళ్లీ అందాల రాక్షసికే ఛాన్స్ ఇచ్చిన బుజ్జి
By: Tupaki Desk | 9 July 2017 12:42 PM GMTఓసారి తన సినిమాలో నటించిన హీరోయన్లకి వాళ్ల నెక్ట్స్ సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వడం నేటి డైరెక్టర్స్ కి ఆనవాయితిగా మారింది. ఒక్క జక్కన్న తప్ప మిగతా డైరెక్టర్స్ అంతా ఈ ట్రెండ్ ని చాలా సిన్సియర్ గా ఫాలో అవుతున్నారు. మళ్లీ ఛాన్స్ ఎందుకు ఇచ్చారని అడిగితే ఆ హీరోయిన్ తో వర్కింగ్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని చాలా డిప్లామెటిక్ గా ఆన్సర్లు ఇస్తున్నారు. రకుల్ విషయంలో ఈ కంఫర్ట్ నెస్ మిగతా హీరోయిన్ల కంటే కాస్త ఎక్కువుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రకుల్ తో పనిచేసిన చాలా మంది దర్శకులు ఆమెను మళ్లీ తమ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడం విశేషం.
ఇక అసలు విషయాని కొస్తే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో అడుగుపెట్టి ట్రాక్ తప్పిన తన కెరీర్ ని మళ్లీ గాఢిలో పెట్టిన హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మరో సారి అదే బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో కొత్త చిత్రానికి సైన్ చేసిందని సమాచారం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న సినిమాకి లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలిసింది. గతంలో పరశురామ్ - అల్లు శిరీష్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ తీయ్యబోతున్న సినిమాలో నటించేందుకు ఈ హాటీ నటించేందుకు రెడీ అవ్వడం విశేషం. మరి విజయ్ దేవరకొండ, లావణ్యత్రిపాఠి జంటను పరశురామ్ ఏ రీతిన ఆన్ స్క్రీన్ చూపబోతున్నాడో చూద్దాం.