Begin typing your search above and press return to search.
నాకు నచ్చిన సినిమాలే చేస్తా: లావణ్య
By: Tupaki Desk | 26 Nov 2017 2:00 PM GMTఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో నిర్మాతలకు, నటీనటులకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తన చిత్ర షూటింగ్ కు వడివేలు సరిగా హాజరు కాకపోవడంతో నష్టపోయానని ప్రముఖ దర్శకుడు శంకర్ నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వడివేలుతోపాటు ఇతరత్రా కారణాల వల్ల నటి త్రిష, నటుడు శింబులపై కూడా నడిగర్ సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందనే వార్తలు వచ్చాయి. తాజాగా, హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు నమోదైందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సినిమా విషయంలో నిర్మాతకు ఆమె 3 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలంటూ నడిఘర్ సంఘం సూచించినట్లుగా కోలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివాదంపై లావణ్య స్పందించింది.
ఆ వివాదంపై తాను నోరు తెరిస్తే పెద్దదవుతుందని మౌనంగా ఉన్నానని, కానీ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాసేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని రాయాలని, తాను ప్రతి విషయాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తాని, పెద్దగా పట్టించుకోనని చెప్పింది. అలా అని ఏది పడితే అది రాయడం తగదని, ఇలాంటి పుకార్లు ఇప్పటికే చాలా విన్నానని అంది. తనపై ఎన్ని వార్తలు రాసుకున్నా తనకేం కాదని, తన గురించి తనకు, తన సన్నిహితులకు తెలుసని చెప్పింది. తనకు నచ్చే చిత్రాలను మాత్రమే చేసే వెసులుబాటు తనకుందని తెలిపింది. ఏది పడితే అది చేయాల్సిన అవసరం తనకు లేదని ఘాటుగా స్పందించింది. నాగచైతన్య - తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `100%లవ్`చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో, అదే చిత్రాన్ని తమిళంలో `100%కాదల్` పేరుతో రీమేక్ చేయబోతున్నారు. ఆ చిత్రంలో తమన్నా నటించిన మహాలక్ష్మి పాత్రలో లావణ్యా త్రిపాఠిని నిర్మాతలు ఎంచుకున్నారు. అయితే, షూటింగ్ మొదలయ్యాక సడెన్ గా ఆ ప్రాజెక్టు నుంచి లావణ్య తప్పుకోవడంతో ఈ వివాదం చెలరేగింది.